తెలంగాణ

telangana

ETV Bharat / bharat

పండుగ వేళ ముందుజాగ్రత్త... కశ్మీర్​లో మళ్లీ ఆంక్షలు - ఆంక్షలు

శుక్రవారం ప్రార్థనల సందర్భంగా కశ్మీర్​లో ఆంక్షలను సడలించిన ప్రభుత్వం... అంతలోనే నిషేధాజ్ఞలు జారీ చేసింది. మొహర్రం సమీపిస్తున్న వేళ అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకుంది.

పండుగ వేళ ముందుజాగ్రత్త... కశ్మీర్​లో మళ్లీ ఆంక్షలు

By

Published : Sep 8, 2019, 1:10 PM IST

Updated : Sep 29, 2019, 9:10 PM IST

మొహర్రం సమీపిస్తున్న తరుణంలో కశ్మీర్​లోని పలు ప్రాంతాల్లో తిరిగి ఆంక్షలను విధించారు అధికారులు. పండగ సందర్భంగా జరిగే ఊరేగింపుల్లో జనం ఎక్కువ సంఖ్యలో గుమిగూడతారని, ఉగ్రకార్యకలాపాలకు పాల్పడేందుకు అవకాశం ఉందన్న కారణంతో ఈ నిర్ణయం తీసుకున్నారు.

శ్రీనగర్ లాల్​ చౌక్ చుట్టు పక్కల ప్రాంతాలను పూర్తిగా మూసేశారు. పలు రహదారుల్లో ఇనుపకంచెలు ఏర్పాటు చేశారు. వైద్య సంబంధిత అత్యవసరం ఉన్న వాళ్లను మాత్రమే బారికేడ్లు దాటి అవతలకు వెళ్లేందుకు అనుమతిస్తున్నారు. మిగతా వారిని ఎక్కడికక్కడ నియంత్రిస్తున్నారు.

జమ్ముకశ్మీర్ స్వయం ప్రతిపత్తి రద్దు చేసి నేటికి 35 రోజులు. అప్పటి నుంచి ఆంక్షల మధ్య కశ్మీర్​లో జనజీవనం సాగుతోంది.

ఇదీ చూడండి: అభివృద్ధికి మారుపేరు మోదీ 2.0: అమిత్​షా

Last Updated : Sep 29, 2019, 9:10 PM IST

ABOUT THE AUTHOR

...view details