తెలంగాణ

telangana

By

Published : May 7, 2020, 9:22 PM IST

ETV Bharat / bharat

'కరోనా వ్యాక్సిన్​ అభివృద్ధిలో సీఎస్​ఐఆర్​ ముందడుగు'

చికిత్సకు దొరక్కుండా రూపాన్ని మార్చుకుంటూ ఎన్నో అనుమానాలు రేకెత్తిస్తోంది కరోనా. అయితే ఈ వైరస్​పై భారత పరిశోధన సంస్థ సీఎస్​ఐఆర్​.. వైరస్​ సంబంధిత జన్యు క్రమాల వివరాలను గ్లోబల్​ డేటాబేస్​కు సమర్పించింది. ఈ వివరాలు వైరస్​ను అర్థం చేసుకోవడం సహా.. వ్యాక్సిన్​ అభివృద్ధికి కూడా కీలకం కానున్నాయని సీఎస్​ఐఆర్​ తెలిపింది.

CSIR submits 53 genome sequences of coronavirus in Indians to global body
కరోనా వ్యాక్సిన్​ అభివృద్ధి చర్యల్లో సీఎస్​ఐఆర్​ ముందడుగు

ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా మహమ్మారి.. చికిత్సకు దొరక్కుండా ఉత్పరివర్తనం చెందుతోందని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో భారత పరిశోధన సంస్థ- కౌన్సిల్ ఫర్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్(సీఎస్‌ఐఆర్‌) వైరస్‌కు చెందిన 53 జన్యు క్రమాల వివరాలను గ్లోబల్‌ డేటాబేస్‌కు సమర్పించింది.

ఈ వివరాలు వైరస్‌ను అర్థం చేసుకోవడమే కాకుండా.. వ్యాక్సిన్‌ అభివృద్ధికీ ఉపకరిస్తున్నాయని సీఎస్‌ఐఆర్‌ తెలిపింది. వీటితో సహా మరో 450 వైరస్‌ జన్యు క్రమాలను ఈ నెల 15లోగా డేటాబేస్‌కు ఇవ్వనున్నట్లు సీఎస్‌ఐఆర్‌ డైరెక్టర్‌ శేఖర్‌ మండే తెలిపారు. కరోనా జన్యు క్రమాలపై సీఎస్‌ఐఆర్‌ పరిశోధనా సంస్థలైన సీసీఎంబీ- హైదరాబాద్‌, ఐజీఐబీ- దిల్లీ విస్తృత స్థాయిలో పరిశోధనలు చేస్తున్నట్లు వివరించారాయన. ఈ జన్యు పరిశోధనలు ముఖ్యంగా డీఎన్‌ఏలోని న్యూక్లియోటైడ్‌ల క్రమాన్ని గుర్తిస్తాయని మండే తెలిపారు. తద్వారా ఒక జీవి పెరుగుదల, అభివృద్ధిని నిర్దేశించడానికి జన్యువులు ఎలా కలిసి పనిచేస్తాయో అర్థం చేసుకోవడానికి ఉపయోగపడతాయని పేర్కొన్నారు.

ఇదీ చదవండి:మందుబాబులకు ఇంటికే మద్యం.. 'సర్కార్'​ గ్రీన్​ సిగ్నల్​

ABOUT THE AUTHOR

...view details