తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'సివిల్‌ సర్వీసెస్‌లో సీశాట్‌ ఉంటుంది' - సివిల్​ సర్వీసెస్​

సివిల్ సర్వీసెస్​లో సీశాట్​ పరీక్షను తొలగించాలన్న ప్రతిపాదనేమీ లేదని సిబ్బంది వ్యవహారాల శాఖ సహాయ మంత్రి తెలిపారు. రాజ్యసభలో అడిగిన ఓ ప్రశ్నకు సమాధానమిస్తూ... సివిల్​ సర్వీస్​ పరీక్షల నమూనాను కూడా మార్చబోమని స్పష్టం చేశారు.

CSAT not to be dropped from UPSC exams, clarifies centre
'సివిల్‌ సర్వీసెస్‌లో సీశాట్‌ ఉంటుంది'

By

Published : Sep 18, 2020, 7:56 AM IST

సివిల్‌ సర్వీసెస్‌ పరీక్షల్లో సివిల్‌ సర్వీసెస్‌ ఆప్టిట్యూడ్‌ టెస్ట్‌ (సీశాట్‌) ఉంటుందని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. రాజ్యసభలో అడిగిన ఓ ప్రశ్నకు సిబ్బంది వ్యవహారాల శాఖ సహాయ మంత్రి జితేంద్ర సింగ్‌ ఈ మేరకు సమాధానమిచ్చారు.

సీశాట్​ పరీక్షను తొలగించాలన్న ప్రతిపాదనేమీ లేదని జితేంద్ర తెలిపారు. సివిల్‌ సర్వీస్‌ పరీక్షల నమూనాను కూడా మార్చబోమని మరో ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.

ఇదీ చూడండి:-రైల్వే ప్రయాణికులకూ యూజర్​ ఛార్జీలు!

ABOUT THE AUTHOR

...view details