ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి, భాజపా నేత త్రివేంద్ర సింగ్ రావత్ చేసిన వ్యాఖ్యలపై ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో జోరుగా చర్చ సాగుతోంది. భూమిపై ఆక్సిజన్‌ను శ్వాసగా తీసుకుని తిరిగి అదే రూపంలో విడుదల చేసే ఏకైక జంతువు ఆవు అన్నారు రావత్. గోవుకు మర్దనం చేసే వారు శ్వాస సంబంధిత సమస్యల నుంచి విముక్తి పొందుతారని చెప్పారు. ఆవు పాలు, గోపంచకంలో వైద్య గుణాల గురించి దెహ్రాదూన్‌లో ఓ కార్యక్రమంలో రావత్ మాట్లాడిన వీడియో సామాజిక మాధ్యమాల్లో గురువారం వైరల్‌గా మారింది.
గోవులతో సావాసం చేసే వారికి క్షయ వ్యాధి కూడా నయమవుతుందని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు రావత్.