ఆవుపేడతో తయారు చేసిన 'గోసత్వ్ కవచ్' చిప్‌ను ఉపయోగిస్తే మొబైల్ ఫోన్ల నుంచి విడుదలయ్యే రేడియేషన్ తగ్గుతుందని తెలిపారు రాష్ట్రీయ కామధేను ఆయోగ్ ఛైర్మన్ వల్లభ్‌భాయ్ కథీరియా. ఆవుపేడ ఉత్పత్తులను ప్రోత్సహించడమే లక్ష్యంగా 'కామధేను దీపావళి అభియాన్' ప్రచార కార్యక్రమాన్ని ఆన్లైన్లో ప్రారంభిస్తూ ఈ చిప్‌ను ఆవిష్కరించారు. ఆవుపేడతో సకల రోగాల నుంచి రక్షణ లభిస్తుందన్నారు.
'ఆవు పేడ చిప్‌తో రేడియేషన్, రోగాల నుంచి రక్షణ'
ఆవుపేడతో తయారు చేసిన చిప్‌ను ఆవిష్కరించారు రాష్ట్రీయ కామధేను ఆయోగ్ ఛైర్మన్ వల్లభ్‌భాయ్ కథీరియా. దీన్ని ఉపయోగిస్తే మొబైల్ ఫోన్ల నుంచి రేడియేషన్ తగ్గడమే కాక, రోగాల బారిన పడకుండా రక్షణ లభిస్తుందని తెలిపారు.
'ఆవుపేడ చిప్‌తో రేడియేషన్, రోగాల నుంచి రక్షణ'
" ఆవుపేడ అందర్నీ రక్షిస్తుంది. ఇది యాంటీ రేడియేషన్. శాస్త్రీయంగా కూడా నిరూపితమైంది. ఈ చిప్‌తో మొబైల్ ఫోన్లలో రేడియేషన్ తగ్గుతుంది. వ్యాధుల నుంచి రక్షణ లభిస్తుంది."
-వల్లభ్‌భాయ్ కథీరియా, రాష్ట్రీయ కామధేను ఆయోగ్ ఛైర్మన్.