తెలంగాణ

telangana

ETV Bharat / bharat

తిహార్​ జైలు నుంచి 3వేల మంది ఖైదీల విడుదల! - coronavirus threat

కరోనా భయాందోళనల నేపథ్యంలో తిహార్​ జైలు అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. జైల్లో రద్దీని తగ్గించేందకు 3వేల మంది ఖైదీలను పెరోల్​పై విడుదల చేయనున్నట్లు డీజీ సందీప్​ గోయల్​ తెలిపారు. ప్రమాదకరమైన నేరస్థులను మాత్రం విడుదల చేయట్లేదని స్పష్టం చేశారు.

COVID-19: Tihar Jail to release 3,000 prisoners to ease congestion in jails
తీహార్​ జైలు నుంచి 3వేల మంది ఖైదీలు విడుదల!

By

Published : Mar 24, 2020, 5:56 AM IST

Updated : Mar 24, 2020, 6:08 AM IST

దేశంలో క్రమంగా విస్తరిస్తున్న కరోనా వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో భారత్‌లో జైళ్ల పరిస్థితిపై తీవ్ర ఆందోళన వ్యక్తం అవుతోంది. ఈ తరుణంలో తిహార్​ జైల్లో రద్దీని తగ్గించేందుకు 3వేల మంది ఖైదీలను పెరోల్‌పై విడుదల చేయాలని నిర్ణయించినట్లు అధికారులు తెలిపారు.

కరోనావైరస్​ ముప్పు నేపథ్యంలో రాబోయే మూడు, నాలుగురోజుల్లో 1500మంది ఖైదీలను పెరోల్​ మీద విడుదల చేయడానికి ప్రయత్నిస్తున్నట్లు, మరో 1500మందిని మధ్యంతర బెయిల్​ పై విడుదల చేయనున్నట్లు డీజీ సందీప్​ గోయల్​ తెలిపారు. వీరిలో కఠినమైన, ప్రమాదకరమైన నేరస్థులను విడుదల చేయడం లేదని స్పష్టం చేశారు.

ఇదీ చూడండి:మధ్యప్రదేశ్​ ముఖ్యమంత్రిగా చౌహానే ఎందుకంటే?

Last Updated : Mar 24, 2020, 6:08 AM IST

ABOUT THE AUTHOR

...view details