దేశంలో లాక్డౌన్ మే 3 వరకు పొడిగించిన నేపథ్యంలో ప్రపంచంలోని తమిళ ప్రజలకు కొన్ని సూచనలు చేశారు సూపర్‌స్టార్ రజనీకాంత్. ప్రపంచంలో తమిళులు ఎక్కడ ఉన్నా ఆయా ప్రభుత్వాల నిబంధనలను పాటించాలని కోరారు. అలా చేస్తే తప్పకుండా కరోనా వైరస్‌పై విజయం సాధించవచ్చని తెలిపారు.
తమిళ నూతన ఏడాది సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఓ వీడియోను ట్విట్టర్లో పోస్ట్ చేశారు రజినీకాంత్.