కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు ఏర్పాటు చేస్తున్న క్రిమిసంహారక సొరంగాలకు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్పై స్పందించాలని కేంద్రాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ టన్నెళ్ల వాడకం, ఉత్పత్తి, ప్రచారం సహా వీటిని ఏర్పాటు చేయడాన్ని తక్షణమే నిషేధించాలన్న పిటిషన్పై జస్టిస్ అశోక్ భూషణ్, జస్టిస్ ఆర్ సుభాష్ రెడ్డి, జస్టిస్ ఎంఆర్ షాతో కూడిన త్రిసభ్య ధర్మాసనం ఈమేరకు స్పందించింది.
ఈ విషయంపై అభిప్రాయం చెప్పాలని కేంద్ర వైద్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ, కేంద్ర సాంకేతిక శాఖ, వ్యవసాయ శాఖకు ధర్మాసనం నోటీసులు జారీ చేసింది.