తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ప్రతి 10 లక్షల జనాభాకు 727 కరోనా కేసులు - దేశంలో కరోనా మరణాలు

దేశంలో ప్రతి పది లక్షల మందికి 727 కరోనా కేసులే ఉన్నట్లు కేంద్రం వెల్లడించింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న కేసులతో పోలిస్తే 4-8 రెట్లు తక్కువేనని తెలిపింది. కరోనాతో దేశంలో 10 లక్షలకు 18.6 మంది మరణిస్తున్నారని... అది ప్రపంచంలోనే అత్యల్ప మరణాల రేటని ఆరోగ్య శాఖ పేర్కొంది.

COVID-19 recovery rate 63.33 pc; of 3.42 lakh active cases less than 1.94 pc in ICU: Health ministry
10 లక్షల మందికి 727 కరోనా మరణాలే: కేంద్రం

By

Published : Jul 17, 2020, 7:28 PM IST

దేశంలో 135 కోట్ల జనాభాలో ప్రతి పది లక్షల మందికి 727.4 కొవిడ్‌-19 కేసులు మాత్రమే ఉన్నాయని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా చూస్తే ఇది 4-8 రెట్లు తక్కువేనని పేర్కొంది. శుక్రవారం నాటికి ఉన్న యాక్టివ్‌ కరోనా బాధితుల సంఖ్య 3,42,756 మాత్రమేనని వెల్లడించింది. 6.35 లక్షల కన్నా ఎక్కువ మంది కోలుకొని ఇళ్లకు వెళ్లారని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ప్రకటించింది.

దేశంలో 10 లక్షలు దాటిన కరోనా కేసులు

కరోనా వైరస్‌ ముప్పుతో దేశంలో ప్రతి పది లక్షలకు 18.6 మంది మరణిస్తున్నారని ప్రపంచంలో ఇదే అత్యల్ప మరణాల రేటని ఆరోగ్యశాఖ తెలిపింది. కేంద్రం, రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు సమష్టిగా పనిచేస్తున్నాయని తెలిపింది. ఇంటింటి సర్వే, కాంటాక్టుల శోధన, కంటెయిన్‌మెంట్‌, బఫర్‌ జోన్లలో ప్రత్యేక పర్యవేక్షణ, వేగంగా టెస్టులు చేయడం, సమయానికి స్పందిస్తుండటం వల్ల కేసుల్ని త్వరగా గుర్తించగలుగుతున్నామని పేర్కొంది. దాంతో త్వరగా చికిత్స అందించగలుగుతున్నామని వెల్లడించింది.

ఎక్కువ కేసులు ఉన్న రాష్ట్రాలు

స్వల్ప, ఓ మోస్తరు, తీవ్ర లక్షణాలు గలవారిని వర్గీకరించి ప్రామాణికంగా చికిత్స చేస్తున్నామని కేంద్రం తెలిపింది. సమర్థంగా అమలు చేసిన వ్యూహాలు సత్ఫలితాలను ఇచ్చాయని పేర్కొంది. వెంటిలేటర్లపై 1%, ఐసీయూలో 2%, ప్రాణవాయువు సహాయంతో 3% కన్నా తక్కువ మందే చికిత్స పొందుతున్నారని వివరించింది. స్వల్ప లక్షణాలున్న వారిని ఇంటివద్దే ఉంచి చికిత్స అందిస్తుండటం వల్ల వైద్యశాలలు, వైద్యులపై చాలా ఒత్తిడి, భారం తగ్గిందని వెల్లడించింది. అన్ని రకాల వైద్య సదుపాయాలు ఉన్నాయని స్పష్టం చేసింది.

రాష్ట్రాల వారీగా కేసులు, మరణాలు

మిలియన్‌ కేసులు దాటిన మూడో దేశం..

ప్రపంచంలో పది లక్షల కేసులు నమోదైన మూడో దేశంగా భారత్‌ నిలిచింది. ఇప్పటి వరకు అమెరికా, బ్రెజిల్‌లోనే కేసుల సంఖ్య పది లక్షలు దాటింది. ఇప్పుడు భారత్‌ ఆ వరుస క్రమంలో మూడోస్థానానికి చేరింది. తాజాగా గురువారం ఒక్కరోజే దేశవ్యాప్తంగా 34,956 పాజిటివ్‌ కేసులు, 687 మరణాలు నమోదయ్యాయి. దీంతో శుక్రవారంనాటికి దేశంలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 10,03,832కు చేరినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది.

అన్ని రాష్ట్రాల్లో కేసుల వివరాలు

ఊరటనిస్తున్న రికవరీ రేటు

దేశంలో కేసుల సంఖ్య పెరుగుతున్నప్పటికీ.. రికవరీ శాతం ఎక్కువగా ఉండటం ఊరట కలిగిస్తోంది. గడిచిన 24 గంటల్లో 22,942 మంది కొవిడ్‌ నుంచి కోలుకున్నారు. ఒక్క రోజులో ఇంత మంది కోలుకోవడం ఇదే తొలిసారి. జూన్‌ నెల మధ్యలో 50శాతంగా ఉన్న రికవరీ రేటు జులై నాటికి 63శాతానికి పెరిగింది. దేశంలో కరోనా సోకిన మొత్తం బాధితుల్లో ఇప్పటివరకు 6,35,757 మంది కోలుకోగా మరో 3,42,473 యాక్టివ్‌ కేసులు ఉన్నట్లు ప్రభుత్వం పేర్కొంది. ఇక మరణాల్లో మాత్రం భారత్‌ ప్రపంచంలో ఎనిమిదో స్థానంలో ఉంది.

జాతీయ, రాష్ట్ర స్థాయిల్లో ఇలా...

ABOUT THE AUTHOR

...view details