కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు విధించిన దేశవ్యాప్త లాక్డౌన్ కారణంగా ఎక్కడివాళ్ళక్కడే ఉంటున్నారు. గడప దాటేందుకు కూడా ఆలోచిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రధాని అధ్యక్షత వహించనున్న కేంద్ర మంత్రిమండలి సమావేశాన్ని సోమవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహించనున్నారు.
చరిత్రలో తొలిసారి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా..
దేశంలో లాక్డౌన్ కారణంగా కేంద్ర మంత్రిమండలి సమావేశం సోమవారం.. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహించనున్నారు. ఈ విధంగా భేటీ కావడం చరిత్రలోనే తొలిసారి కావడం గమనార్హం.
చరిత్రలో తొలిసారి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా..
ఈ విధంగా భేటీ కావడం చరిత్రలోనే తొలిసారి. మంగళవారం కేబినెట్ భేటీ కూడా వీడియో కాన్ఫెరన్స్ ద్వారానే జరగనుంది.
మార్చి 24న ప్రధాని 21 రోజుల లాక్డౌన్ ప్రకటించిన తర్వాత.. తొలిసారి మంత్రులంతా సమావేశం కానున్నారు. దేశంలో కరోనా వ్యాప్తికి వ్యతిరేకంగా ఆయా రాష్ట్రాలు తీసుకున్న చర్యలపై చర్చించనున్నారు.