కరోనా కట్టడి కోసం దేశవ్యాప్తంగా విధించిన లాక్ డౌన్ కారణంగా ఎందరో వివాహాలు వాయిదా పడ్డాయి. కానీ.. ఉత్తర్‌ప్రదేశ్ హమీర్పుర్ జిల్లా పౌథియా గ్రామానికి చెందిన ఓ యువకుడు వివాహం చేసుకోవాలని నిశ్చయించుకున్నాడు. అందుకోసం సుమారు 100 కిలోమీటర్ల దూరం సైకిల్‌పై వెళ్లి ఆలయంలో వధువు మెడలో తాలి కట్టాడు.
యూపీలోని హమీర్‌పుర్‌కు చెందిన కల్కు ప్రజాపతి అనే యువకుడు.. లాక్డౌన్ ఉన్నప్పటికీ వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. బరాత్‌కు అధికారులు అనుమతించకపోవడం వల్ల మహోబా జిల్లాలోని వధువు గ్రామమైన పునియాకు ఒక్కడే వెళ్లేందుకు సిద్ధమయ్యాడు. వెంటనే సైకిల్ మీద వంద కిలోమీటర్లు ప్రయాణించాడు.