తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'హోం​ ఐసోలేషన్' కొత్త మార్గదర్శకాలు ఇవే..

లక్షణాలు లేకున్నా కరోనా కేసులు​ పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ఆరోగ్య శాఖ 'హోం ఐసోలేషన్​' నిబంధనలను సవరించింది. తేలికపాటి, ముందస్తు కరోనా లక్షణాలు కనిపించే బాధితుల జాబితాలో వీరిని చేర్చింది. తీవ్రమైన ఆరోగ్య సమస్యలు ఉన్నవారికి హోం ఐసోలేషన్​కు అవకాశం లేదని స్పష్టం చేసింది.

VIRUS-HEALTH-GUIDELINES
ఐసోలేషన్

By

Published : Jul 3, 2020, 2:26 PM IST

కేంద్ర ఆరోగ్య శాఖ 'హోం ఐసోలేషన్' మార్గదర్శకాలను సవరించింది. చాలా మందిలో కరోనా పాజిటివ్​గా తేలిన లక్షణాలు కనిపించకపోవటం వల్ల కొత్త నిబంధనలను గురువారం విడుదల చేసింది. తేలికపాటి, ముందస్తు కరోనా లక్షణాలు కనిపించే రోగుల జాబితాలో అసింప్టోమేటిక్ (లక్షణాలు కనిపించని) వారిని చేర్చింది.

అయితే హెచ్​ఐవీ, అవయవ మార్పిడి చేసుకున్నవారు, కేన్సర్ చికిత్స తీసుకునేవారు.. స్వీయ నిర్బంధానికి అర్హులు కాదని ఆరోగ్య శాఖ స్పష్టం చేసింది. మరికొందరి విషయంలో వైద్యులు పర్యవేక్షించి సిఫార్సు చేస్తేనే హోం ఐసోలేషన్​కు అనుమతిస్తారు.

ఈ జాబితాలో..

  • 60 ఏళ్ల పైబడిన వారు
  • రక్తపోటు, చక్కెర వ్యాధి, గుండె సంబంధిత వ్యాధులు
  • ఊపిరితిత్తులు, కాలేయం, మూత్ర పిండాల దీర్ఘకాలిక సమస్యలతో బాధపడేవారు
  • సెరెబ్రో వస్క్యులర్ (మెదడు సంబంధిత) వ్యాధితో బాధపడుతున్నవారు వైద్యుల అనుమతితోనే హోం​ ఐసోలేషన్​లో ఉండవచ్చు.

హోం ఐసోలేషన్​లో ఉన్న రోగులను లక్షణాలు ప్రారంభమైన 10 రోజుల తర్వాత డిశ్ఛార్జి చేసే అవకాశం ఉంది. మూడు రోజులు జ్వరం లక్షణాలు తగ్గిపోతే మళ్లీ నిర్ధరణ పరీక్షలు లేకుండానే ఈ నియమం వర్తిస్తుంది. ఆ తర్వాత వారంపాటు తమ ఆరోగ్యం పట్ల స్వీయ పర్యవేక్షణ అవసరం ఉంటుందని కొత్త మార్గదర్శకాలు చెబుతున్నాయి.

కావాల్సిన ఏర్పాట్లు..

  • తమ ఇంట్లో హోం ఐసోలేషన్​కు తగిన ఏర్పాట్లు ఉంటేనే ఇందుకు అధికారులు అనుమతిస్తారు.
  • రోగిని పర్యవేక్షించే వ్యక్తి 24 గంటలు అందుబాటులో ఉండాలి. నిత్యం ఆసుపత్రి సిబ్బందితో ఎప్పటికప్పుడు రోగి వివరాలు అందించాలి.
  • రోగిని చూసుకునే వ్యక్తితోపాటు సన్నిహితంగా ఉన్నవారు హైడ్రాక్సీక్లోరోక్విన్ ఔషధాన్ని తీసుకోవాలి.
  • ఆరోగ్య సేతు యాప్​ను మొబైల్​లో ఇన్​స్టాల్​ చేసుకుని ఎల్లవేళలా యాక్టివ్​(బ్లూటూత్​ లేదా వైఫై ద్వారా)గా ఉంచాలి.
  • రోగులు తమ ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు గమనిస్తూ జిల్లా నిఘా అధికారికి నివేదించాలి. అనారోగ్యం తీవ్రమైతే వెంటనే వైద్య సహాయాన్ని పొందాలి.
  • అధికారులు నిర్దేశించిన కాలంపాటు కఠినంగా గృహ నిర్బంధంలో ఉంటానని స్వచ్ఛందంగా హామీ ఇవ్వాలి.
  • హోం ఐసోలేషన్​లో ఉన్నవారిని క్షేత్ర స్థాయి అధికారులు.. రోజూ వెళ్లి శరీర ఉష్ణోగ్రత, హృదయ స్పందన, రక్తంలో ఆక్సిజన్​ స్థాయులను నమోదు చేసుకోవాలి.
  • ఈ వివరాలన్నీ కొవిడ్- 19 పోర్టల్ అండ్ ఫెసిలిటీ యాప్​లో అప్​డేట్ చేయాలి.

ఇదీ చూడండి:కరోనా బాధితుల పర్యవేక్షణకు బుల్లి పరికరం

ABOUT THE AUTHOR

...view details