కరోనా మహమ్మారి అనేక దేశాలకు సవాలు విసురుతోందని, అయితే భారత్‌కు ఒక అవకాశం ఇచ్చిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ వ్యాఖ్యానించింది. ఆరోగ్య బీమా పథకం 'ఆయుష్మాన్ భారత్' వేగవంతం చేసేందుకు ఇదే సరైన సమయమని పేర్కొంది.
భారత్‌లో కరోనా పరిస్థితిపై స్పందించిన టెడ్రోస్.. వైరస్ వ్యాప్తి వేగంగా పెరుగుతోందని స్పష్టం చేశారు. కేసుల సంఖ్యలో ఇటలీని దాటి ఆరో స్థానానికి చేరిందని తెలిపారు.
"కరోనా వైరస్ చాలా దేశాలకు సవాల్ విసురుతోంది. కానీ అవకాశాలపైనా మనం దృష్టి పెట్టాలి. ఉదాహరణకు.. భారత్‌లో ఆయుష్మాన్ భారత్ బీమా పథకాన్ని వేగవంతం చేయాలి. ముఖ్యంగా ప్రాథమిక ఆరోగ్య సంరక్షణపై దృష్టి సారించాలి. ఆయుష్మాన్ భారత్‌ను విస్తరించేందుకు భారత ప్రభుత్వం దృఢ నిశ్చయంతో ఉందని నాకు తెలుసు. ఈ విపత్తును మనం అధిగమించగలమని నమ్మకం ఉంది."