కరోనా మహమ్మారిపై పోరాటానికి ఏర్పాటు చేసిన పీఎం కేర్స్ నిధికి విరాళాలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికే పలు కార్పొరేట్ సంస్థలు, పారిశ్రామిక, సినీ, రాజకీయ నేతలు సహాయం అందిచారు. తాజాగా కేరళ రాష్ట్ర ప్రభుత్వం అధీనంలోని కోల్ ఇండియా (సీఐఎల్) సంస్థ రూ. 221 కోట్లు 'ప్రైమినిస్టర్ సిటిజన్ అసిస్టాన్స్ అండ్ రిలీఫ్ ఇన్ ఎమర్జెన్సీ సిచ్యూయేషన్ ఫండ్' (పీఎం కేర్స్)కు విరాళంగా అందించింది. సీఐఎల్లోని ఉద్యోగులు స్వచ్ఛందంగా తమ ఒక్కరోజు వేతనం రూ.61 కోట్లను అందించినట్లు అధికారులు తెలిపారు. కోల్ మైన్ యజమాని సామాజిక సేవ బాధ్యతలో భాగంగా రూ.160 కోట్లు అందించినట్లు చెప్పారు.
బజాజ్ ఫినాన్స్.. రూ.10 కోట్లు
కరోనాపై పోరులో భాగంగా బజాజ్ ఫిన్సర్వ్, దాని అనుబంధ సంస్థలు, ఉద్యోగులు కలిసి పీఎం కేర్స్‌కు రూ.10 కోట్లు విరాళంగా అందించినట్లు ప్రకటించింది సంస్థ. 32 వేల మంది ఉద్యోగులు తమ వేతనాల్లో కొంత భాగాన్ని సహాయంగా అందించినట్లు పేర్కొంది.
జుబిలాంట్ గ్రూప్.. రూ.10 కోట్లు