తెలంగాణ

telangana

ETV Bharat / bharat

దేశంలో పెరుగుతున్న కరోనా కేసులు- ఆగని మృత్యుఘోష​ - corona cases latest news

దేశంలో కరోనా కేసులు 2301కి చేరినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ ప్రకటించింది. ఇందులో 2088 యాక్టివ్​ కేసులున్నట్లు స్పష్టం చేసింది. మరో 157 మంది కరోనా నుంచి పూర్తిగా కోలుకోగా.. మృతుల సంఖ్య 56కు చేరింది.

COVID-19 cases rises to 2301 in india
దేశంలో ఆగని కరోనా కేసులు-పెరుగుతున్న మృత్యుఘోష​

By

Published : Apr 3, 2020, 11:21 AM IST

దిల్లీ నిజాముద్దీన్​ తబ్లీగీ జమాత్​ ప్రార్థనల కారణంగా దేశంలో కరోనా కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. ఇప్పటివరకు దేశవ్యాపంగా 2301 మంది కరోనా బారినపడ్డట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. ఇందులో 2088 యాక్టివ్​ కేసులుండగా.. 157 మంది కరోనా నుంచి కోలుకున్నట్లు స్పష్టం చేసింది. దేశవ్యాప్తంగా మృతుల సంఖ్య 56కు చేరింది.

కేంద్ర ఆరోగ్యశాఖ గణాంకాల ప్రకారం.. మహారాష్ట్రలో అత్యధికంగా 335 కేసులు నమోదవగా.. 16 మంది మరణించారు. తమిళనాడులో ఒకరు మృతి చెందగా.. మొత్తం 309 కేసులు నమోదయ్యాయి. కేరళలో ఇద్దరు ప్రాణాలు కోల్పోగా... మొత్తం 286 కొవిడ్​-19 కేసులు బయటపడ్డాయి.

గుజరాత్​లో మరొకరు మృతి

గుజరాత్​ వడోదరాలో 78 ఏళ్ల వృద్ధుడు కరోనాతో మృత్యువాతపడ్డాడు. స్థానిక ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గత రాత్రి మరణించినట్లు రాష్ట్ర వైద్యాధికారులు వెల్లడించారు.

రాజస్థాన్​లో 154

రాజస్థాన్​లో మరో 14 మందికి కరోనా సోకినట్లు అధికారులు గుర్తించారు. వీరిలో ఏడుగురు తబ్లీగీ జమాత్​ ప్రార్థనల్లో పాల్గొన్నవారితో కలిసి తిరిగినట్లు వెల్లడించారు. కొత్త కేసులతో కలిపి రాష్ట్రవ్యాప్తంగా కొవిడ్​-19 బారినపడ్డవారి సంఖ్య 154కు పెరిగింది.

మధ్యప్రదేశ్​లో 119

మధ్యప్రదేశ్​లో మరో 8 కరోనా కేసులు గుర్తించారు అధికారులు. వీరిలో ఒకరు ప్రభుత్వ ఉద్యోగి ఉన్నట్లు తెలుస్తోంది. వీరితో కలిపి రాష్ట్రవ్యాప్తంగా కొవిడ్​-19 బారిన పడ్డవారి సంఖ్య 119కి చేరింది.

గోవాలో 6

గోవాలో మరొకరికి కరోనా పాజిటివ్​గా తేలింది. ఫలితంగా ఆ రాష్ట్రంలో కొవిడ్​-19 కేసుల సంఖ్య 6కు చేరింది.

ABOUT THE AUTHOR

...view details