తెలంగాణ

telangana

ETV Bharat / bharat

50 మంది మీడియా, వైద్య సిబ్బందికి కరోనా - 50 మంది మీడియా, వైద్య సిబ్బందికి కరోనా పాజిటివ్​

దేశవ్యాప్తంగా కరోనా వైరస్​ వ్యాప్తి పెరుగుతోంది. రోజురోజుకు కేసులు సంఖ్య పెరుగుతోంది. లాక్​డౌన్​ ఉన్నా అత్యవసర సేవల విభాగంలో మీడియా, వైద్య సిబ్బంది నిరంతరం సేవలందిస్తున్నారు. ఈ మహమ్మారి వారినీ వదిలిపెట్టడం లేదు. తాజాగా 50 మందికి ఈ వైరస్ సోకినట్లు అధికారులు వెల్లడించారు.

COVID-19: At least 25 people of Tamil news channel test positive in Chennai
50 మంది మీడియా, వైద్య సిబ్బందికి కరోనా పాజిటివ్​

By

Published : Apr 21, 2020, 3:53 PM IST

భారత్​లోని పలు రాష్ట్రాలను వణికిస్తోన్న కరోనా వైరస్​.. ఎవర్నీ వదిలిపెట్టడం లేదు. అత్యవసర సేవల్లో పనిచేస్తున్న వారికి ఇంకా ముప్పుగా మారుతోంది. తాజాగా 25 మంది మీడియా, 25 మంది వైద్య సిబ్బందికి వైరస్​ పాజిటివ్​ రావడం కలకలం సృష్టిస్తోంది.

దాదాపు 27 మంది..!

తమిళనాడులోని ఓ ప్రముఖ న్యూస్‌ ఛానల్‌లో విధులు నిర్వర్తిస్తున్న 27 మంది జర్నలిస్ట్​లకు.. కరోనా పాజిటివ్‌గా తేలింది. తొలుత 24 ఏళ్ల జర్నలిస్ట్‌కు కరోనా లక్షణాలు కనిపించడం వల్ల మొత్తం 90 మందికి వైద్య పరీక్షలు జరిపించారు. మంగళవారం వచ్చిన ఫలితాల్లో 25 మందికి కొవిడ్​-19 సోకినట్టు తేలింది. తాజాగా మరో ఇద్దరి ఫలితాలు పాజిటివ్​గా వచ్చినట్లు తెలుస్తోంది. దీనిపై స్పష్టత రావాల్సి ఉంది.

25 మంది వైద్య సిబ్బందికి కరోనా

మహారాష్ట్రలో కరోనా మహమ్మారి ఉద్ధృతి కొనసాగుతోంది. పుణెలో 25 మంది పారామెడికల్‌ సిబ్బందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధరణ కావడం కలకలం రేపుతోంది. వీరిలో 19 మంది నర్సులు ఉన్నట్టు పుణెలోని రూబీ హాల్‌ క్లీనిక్‌ ఆస్పత్రి సీఈఓ వెల్లడించారు. ప్రస్తుతం వారంతా క్షేమంగా ఉన్నారని... ఐసోలేషన్​లో ఉంచినట్లు వైద్యులు తెలిపారు.

గత వారం జనరల్​ వార్డులో చేరిన ఓ వ్యక్తికి ఓ నర్సు సేవలందించింది. ఆ తర్వాత అతడికి కరోనా లక్షణాలు బయటపడ్డాయి. అలా ఆ నర్సు నుంచి మిగతావారికి మహమ్మారి సోకి ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. ప్రస్తుతం 1000 మంది సిబ్బందికి టెస్టులు చేశారు.

ఇటీవలె ముంబయిలో 53 మంది జర్నలిస్టులు, అహ్మదాబాద్​లో విధులు నిర్వహిస్తోన్న 24 మంది పోలీసులు కరోనా మహమ్మారికి చిక్కారు.

ఇదీ చదవండి: 53 మంది జర్నలిస్టులకు సోకిన మహమ్మారి​​

ABOUT THE AUTHOR

...view details