తెలంగాణ

telangana

ETV Bharat / bharat

కొవాగ్జిన్‌తో సత్ఫలితాలు: భారత్‌ బయోటెక్‌ - భారత్‌ బయోటెక్‌

కరోనా టీకా ప్రయోగాల్లో పురోగతి సాధించినట్లు తెలిపింది భారత్​ బయోటెక్​. జంతువులపై కొవాగ్జిన్​ ప్రయోగాలు అద్భుత ఫలితాలిచ్చాయన్న సంస్థ.. ఎలాంటి ప్రతికూల ప్రభావం కనిపించలేదని స్పష్టం చేసింది.

Bharat Biotech New update on Covaxin
కొవాగ్జిన్‌తో సత్ఫలితాలు: భారత్‌ బయోటెక్‌

By

Published : Sep 11, 2020, 9:32 PM IST

కరోనా వైరస్‌కు వ్యాక్సిన్‌ కొనుగొనే ప్రయోగాల్లో భారత్‌ బయోటెక్‌ మరో ముందడుగు వేసినట్లు తెలిపింది. జంతువులపై కొవాగ్జిన్‌ ప్రయోగాలు సత్ఫలితాలు ఇచ్చాయని వెల్లడించింది. వ్యాక్సిన్‌ ఇచ్చిన జంతువుల్లో రోగనిరోధక శక్తి గణనీయంగా పెరిగిందని స్పష్టం చేసింది. ఈ మేరకు ట్విట్టర్​ వేదికగా వెల్లడించింది భారత్​ బయోటెక్​ సంస్థ.

'వ్యాధి నియంత్రణ అద్భుతం'

వ్యాక్సిన్‌తో ఎలాంటి ప్రతికూల ప్రభావం కలగలేదని పేర్కొంది బయోటెక్​. జంతువుల్లో రెండో డోస్‌ ఇచ్చిన 14 రోజుల తర్వాత పరిశీలించామన్న బయోటెక్​.. ముక్కు, గొంతు, ఊపిరితిత్తుల్లో వైరస్‌ వృద్ధిని నియంత్రించినట్లు గుర్తించామని తెలిపింది. టీకా ఇచ్చిన జంతువుల్లో వ్యాధి నియంత్రణ అద్భుతంగా ఉందని సంస్థ పేర్కొంది. మొదటి దశ క్లినికల్‌ ట్రయల్స్‌ను విజయవంతంగా పూర్తి చేసిన భారత్‌ బయోటెక్‌ సంస్థ.. ఇటీవలే నిమ్స్‌లో రెండోదశ ట్రయల్స్‌ ప్రారంభించింది.

ఇదీ చదవండి:కరోనా అనంతరం తలెత్తే సమస్యలపై 'ఫోన్​ సర్వే'

ABOUT THE AUTHOR

...view details