తెలంగాణ

telangana

ETV Bharat / bharat

సుశీల్​ మోదీ దావాపై రాహుల్​కు సమన్లు - దొంగ

పరువునష్టం కేసులో కాంగ్రెస్​ అధ్యక్షుడు రాహుల్​ గాంధీకి సమన్లు జారీ చేసింది పట్నా కోర్టు. మే 20న కోర్టు ఎదుట హాజరుకావాలని ఆదేశించింది.

రాహుల్​కు సమన్లు

By

Published : Apr 28, 2019, 6:02 AM IST

Updated : Apr 28, 2019, 7:45 AM IST

రాహుల్​కు సమన్లు

బిహార్​ ఉపముఖ్యమంత్రి సుశీల్ కుమార్​ మోదీ వేసిన పరువునష్టం దావాపై.. కాంగ్రెస్​ అధ్యక్షుడు రాహుల్​గాంధీకి పట్నా​ కోర్టు సమన్లు జారీ చేసింది.

రాహుల్​ గాంధీ ఓ రాజకీయ సభలో 'అందరు దొంగలు మోదీ ఇంటిపేరును కలిగిఉన్నారు' అని వ్యాఖ్యలు చేసినట్లు ఆరోపించారు సుశీల్​. రాహుల్​ గాంధీపై పరువునష్టం దావా వేశారు. విచారణ జరిపిన మేజిస్ట్రేట్​ శశికాంత్​ రాయ్​ మే 20న రాహుల్​ను కోర్టు ముందు హాజరుకావాలని ఆదేశించారు.

కర్ణాటకలోని కోలార్​ ఎన్నికల ర్యాలీలో కాంగ్రెస్​ అధ్యక్షుడు.. ప్రధాని మోదీపై విమర్శలు గుప్పించారు. లలిత్​ మోదీ, నీరవ్​ మోదీ వంటి వారిపై చర్యలు తీసుకోకుండా మోదీ ప్రభుత్వం అధికార దుర్వినియోగానికి పాల్పడుతుందని ఆరోపించారు. అదే సభలో 'మోదీ' సంబంధిత వ్యాఖ్యలు చేశారు రాహుల్​.

రాహుల్​ వ్యాఖ్యలు.. మోదీ ఇంటిపేరు కలిగిఉన్న తన పరువుకు భంగం కలిగించేలా ఉన్నాయని శుక్రవారం రోజు కోర్టును ఆశ్రయించారు సుశీల్​ కుమార్​ మోదీ.

Last Updated : Apr 28, 2019, 7:45 AM IST

ABOUT THE AUTHOR

...view details