తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'రాహుల్ 'దేశద్రోహం కేసు'​ పిటిషన్​పై నివేదిక ఇవ్వండి' - delhi court

రాహుల్​ గాంధీపై 'దేశద్రోహం' కేసు​ నమోదు చేయాలన్న పిటిషన్​పై ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకున్నారో తెలపాలని పోలీసులను ఆదేశించింది దిల్లీ కోర్టు. 2016లో ప్రధాని మోదీపై కాంగ్రెస్​ అధ్యక్షుడు రాహుల్​ గాంధీ చేసిన వ్యాఖ్యలు దేశద్రోహాన్ని తలపించేలా ఉన్నాయని పిటిషన్​ దాఖలైంది.

'రాహుల్ 'దేశద్రోహం కేసు'​ పిటిషన్​పై నివేదిక ఇవ్వండి'

By

Published : Apr 27, 2019, 7:47 AM IST

రాహుల్ 'దేశద్రోహం కేసు'​ పిటిషన్​పై నివేదిక ఇవ్వండి: దిల్లీ కోర్టు

కాంగ్రెస్​ అధ్యక్షుడు రాహల్ గాంధీపై ఎఫ్​ఐఆర్ నమోదు చేయాలని దాఖలైన పిటిషన్​పై ఇప్పటివరకు తీసుకున్న చర్యలపై నివేదిక సమర్పించాలని దిల్లీ కోర్టు పోలీసులను ఆదేశించింది.

2016లో ప్రధాని నరేంద్ర మోదీపై రాహుల్​ గాంధీ చేసిన వ్యాఖ్యలు దేశద్రోహాన్ని తలపించేలా ఉన్నాయని న్యాయవాది జోగిందర్​ తులి పిటిషన్​ దాఖలు చేశారు. రాహుల్​పై ఎఫ్​ఐఆర్​ నమోదు చేయాలని వ్యాజ్యంలో పేర్కొన్నారు.

పిటిషన్ విచారణ సమయంలో 'రాహుల్​ వ్యాఖ్యలు ఏదైనా పత్రికలో వచ్చాయా? ఈ విషయం మీ దృష్టికి ఎలా వచ్చింది? 2016లో చేసిన వ్యాఖ్యలపై 2019లో ఎందుకు విచారణ చేయమంటున్నారు' అని న్యాయస్థానం పిటిషనర్​ను ప్రశ్నించింది.

'వార్తా పత్రికల్లో రాహుల్​ వ్యాఖ్యలు ప్రచురితమయ్యాయి. పోలీసుల వద్ద వీడియో రికార్డు ఉంది. 2016లోనే ఈ విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేశాను. కానీ ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు' అని పిటిషనర్​ తులి వివరణ ఇచ్చారు. తదుపరి విచారణను న్యాయస్థానం మే 15కు వాయిదా వేసింది.

2016లో రాహుల్ వ్యాఖ్యలు

ప్రధాని నరేంద్ర మోదీ సైనికుల త్యాగాలను అగౌరవపరుస్తున్నారని అక్టోబరు 6, 2016లో ఉత్తరప్రదేశ్​ కాంగ్రెస్​ సమావేశంలో వ్యాఖ్యానించారు రాహుల్. దీనిని దేశద్రోహంగా పరిగణించాలని న్యాయవాది తులి పిటిషన్​ దాఖలు చేశారు.

ఇదీ చూడండి: న్యాయవ్యవస్థ సమగ్రతకు పెద్ద దెబ్బే: జస్టిస్​ హెగ్డే

ABOUT THE AUTHOR

...view details