తెలంగాణ

telangana

ETV Bharat / bharat

హైఅలర్ట్​: దేశంలోకి ప్రవేశించిన ఐఎస్​ఐ ముఠా! - దేశం

దేశవ్యాప్తంగా భద్రతను కట్టుదిట్టం చేయాలని రాజస్థాన్​లోని సిరోహి జిల్లా ఎస్పీ పేరుతో నోటీసులు జారీ అయ్యాయి. ఓ ఐఎస్​ఐ ఏజెంట్ సహా నలుగురు అనుమానితులు దేశంలోకి ప్రవేశించారని, ఎప్పుడైనా దాడులు జరిగేందుకు అవకాశం ఉందని పేర్కొంది.

దేశంలోకి ఐదుగురు అనుమానితుల ప్రవేశం?

By

Published : Aug 20, 2019, 9:21 AM IST

Updated : Sep 27, 2019, 3:06 PM IST

పాకిస్థాన్ గూఢచర్య సంస్థ ఐఎస్​ఐకి చెందిన ఓ ఏజెంట్​ సహా మరో నలుగురు అనుమానితులు దేశంలో ప్రవేశించారని సమాచారం. ఈ నేపథ్యంలో రాజస్థాన్-గుజరాత్ సహా దేశవ్యాప్తంగా హైఅలర్ట్ ప్రకటించారు. అఫ్గానిస్థాన్ పాస్​పోర్టులతో అనుమానస్పద వ్యక్తులు భారత్​లో ప్రవేశించారని తెలుస్తోంది.

ఈ విషయంపై రాజస్థాన్​లోని సిరోహి జిల్లా ఎస్పీ ఓ ప్రకటనను విడుదల చేశారు.

రాజస్థాన్ పోలీసుల ప్రకటన

"అఫ్గానిస్థాన్​ పాస్​పోర్టులతో ఓ ఐఎస్​ఐ ఏజెంట్ సహా నలుగురు అనుమానితులు దేశంలో ప్రవేశించారు. వారు ఏ సమయంలోనైనా ఉగ్ర కార్యకలాపాలకు దిగవచ్చు."-కల్యాణ్​మల్ మీనా, సిరోహి జిల్లా ఎస్పీ.

హోటళ్లు, బస్టాండులు వంటి జనసంచారం ఎక్కువగా ఉండే ప్రదేశాల్లో తనిఖీలు ముమ్మరంగా చేపట్టాలని పోలీసులకు సూచించారు. రహదారులపై చెక్​పాయింట్లు ఏర్పాటు చేసి వాహనాలను తనిఖీలు చేయలని ఆదేశించారు.

ఇదీ చూడండి: 'రాజీవ్ నిర్ణయాలే సమాచార విప్లవానికి పునాది'

Last Updated : Sep 27, 2019, 3:06 PM IST

ABOUT THE AUTHOR

...view details