కేంద్ర మంత్రులందరూ సోమవారం నుంచి తమ మంత్రిత్వశాఖల కార్యాలయాల్లో విధులను నిర్వర్తించాలని పీఎంఓ సూచించినట్లు తెలుస్తోంది. లాక్డౌన్ అనంతరం ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు ప్రణాళికలను సిద్ధం చేయాలని మంత్రులకు నిర్దేశం చేసినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.
ఈ మేరకు ఇన్ని రోజులు ఇంటి వద్ద నుంచి పనిచేసిన సంయుక్త కార్యదర్శులు, ఉన్నతస్థాయి అధికారులు మంత్రుల కార్యాలయాల్లో విధులకు హాజరు కానున్నట్లు ఆయా శాఖలకు ఉత్తర్వులు అందాయి. అవసరం మేరకు మూడో వంతు సిబ్బంది విధులకు వెళ్లాలని ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.