'బలగాల ఉపసంహరణపై భారత్- చైనా కీలక నిర్ణయం'
12:32 June 23
'బలగాల ఉపసంహరణపై భారత్- చైనా కీలక నిర్ణయం'
గల్వాన్ లోయలో నెలకొన్న ప్రతిష్టంభనకు తెరదించే దిశగా భారత్- చైనా కీలక నిర్ణయం తీసుకున్నాయి. బలగాల ఉపసంహరణపై పరస్పర అంగీకారానికి వచ్చాయి. సోమవారం జరిగిన సైనిక చర్చల ద్వారా ఈ మేరకు పురోగతి సాధించినట్లు భారత సైన్యం వెల్లడించింది.
"మోల్డోలో సోమవారం కార్ప్స్ కమాండర్ స్థాయి చర్చలు సానూకూల, నిర్మాణాత్మక వాతావరణంలో జరిగాయి. బలగాల ఉపసంహరణపై పరస్పర అంగీకారం కుదిరింది. తూర్పు లద్దాఖ్‌లోని సమస్యాత్మక ప్రాంతాల్లో బలగాల ఉపసంహరణపై విస్తృత చర్చ జరిగింది. ఆ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను రెండు దేశాల సైన్యాలు అమలు చేస్తాయి."
-భారత సైన్యం ప్రకటన