తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'మహా'లో కరోనా ఉద్ధృతి.. కొత్తగా 14,361 కేసులు - #Covid-19

దేశంలో కరోనా విలయతాండవం కొనసాగుతోంది. దక్షిణ భారత్​లో కర్ణాటక, తమిళనాడు, కేరళ, మహారాష్ట్రలో భారీగా కేసులు నమోదవుతున్నాయి. ఉత్తర్​ప్రదేశ్​, బంగాల్​ రాష్ట్రాల్లోనూ బాధితులు పెరుగుతున్నారు.

Coronavirus new cases and deaths reported in the Nation
మహాలో కరోనా ఉద్ధృతి.. కొత్తగా 14,361 కేసులు

By

Published : Aug 28, 2020, 8:04 PM IST

భారత్​లో కరోనా కేసులు అంతకంతకూ పెరుగుతున్నాయి. మహారాష్ట్రలో తాజాగా 14,361 మందికి వైరస్​ సోకగా... 331 మంది మృతి చెందారు. 5,43,170 మంది కొవిడ్​ నుంచి కోలుకున్నారు.

కర్ణాటకలో శుక్రవారం 8,960 కరోనా కేసులు నమోదవగా... 136 మంది ప్రాణాలు కోల్పోయారు. ఫలితంగా రాష్ట్రంలో మొత్తం బాధితుల సంఖ్య 3,18,752కు చేరింది.

ఉత్తర్​ప్రదేశ్​లో ఒక్కరోజే 5,447 మందికి వైరస్ పాజిటివ్​గా తేలింది. మరో 77 మంది ప్రాణాలు కోల్పోయారు.

  • కేరళలో కొత్తగా 2,543 మంది వైరస్ బారిన పడ్డారు.
  • దిల్లీలో మరో 1,808 కేసులు బయటపడ్డాయి. 20 మంది చనిపోయారు. మొత్తం కేసులు లక్షా 70వేలకు చేరువలో ఉన్నాయి.

ఇదీ చూడండి:పార్లమెంటుకు వచ్చే ఎంపీలకు కరోనా టెస్టులు!

ABOUT THE AUTHOR

...view details