తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'మోదీజీ.. మాకూ ఆర్థిక ప్యాకేజీ ప్రకటించండి' - ఐఎన్​టీయూసీ

కరోనా వైరస్​ ప్రపంచ ఆర్థిక వ్యవస్థను అతలాకుతలం చేస్తోంది. ఈ ప్రాణాంతక మహమ్మారి మానవాళిని కష్టాల్లోకి నెట్టేసింది. ఈ నేపథ్యంలో కొవిడ్​-19 ప్రభావం వల్ల భారీగా నష్టపోతున్నామని.. తమకు ఆర్థిక సహాయం అందించాలని మోదీకి లేఖ రాశాయి కార్మిక సంఘాలు.

Coronavirus lockdown: Trade unions write to PM, seek Rs 5-7 lakh cr relief package
'మోదీజీ.. మాకూ ఆర్థిక ప్యాకేజీ ప్రకటించండి'

By

Published : Mar 27, 2020, 8:19 AM IST

భారత్​ సహా ప్రపంచ దేశాలను బెంబేలెత్తిస్తోన్న కొవిడ్-19 ప్రభావం వల్ల తీవ్రంగా నష్టపోతున్న కార్మికులకు ఆర్థిక ప్యాకేజీ ప్రకటించాలని కేంద్ర కార్మిక సంఘాలు ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశాయి. ప్రభుత్వం వెంటనే 5 నుంచి 7 లక్షల కోట్ల రూపాయిల ప్యాకేజీని ప్రకటించాలని డిమాండ్ చేశాయి.

కేంద్ర ప్రభుత్వం విధించిన లాక్​డౌన్​ వల్ల అన్ని వర్గాల ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఐఎన్​టీయూసీ, ఏఐటీయూసీ, సీఐటీయూ సహా మొత్తం 10 యూనియన్లు లేఖలో ప్రస్తావించాయి.

'' ప్రస్తుత లాక్​డౌన్​ పరిస్థితుల్లో కార్మికులు ఎన్నో కష్టాలను ఎదుర్కొంటున్నారు. తక్షణమే ఈ వర్గం కోసం 5 నుంచి 7 లక్షల కోట్ల రూపాయల ప్యాకేజీ ప్రకటించాలని డిమాండ్​ చేస్తున్నాం.''

- మోదీకి లేఖలో కార్మిక సంఘాలు

కార్మికులుగా నమోదు చేసుకున్న ప్రతి ఒక్కరికీ 5000 చొప్పున ఆర్థిక సహాయం ఇవ్వాలని కోరాయి. బంద్​తో సతమతవుతున్న చిన్న,మధ్య తరహా పరిశ్రమలకు, చిరు వ్యాపారులుకు రాయితీలు ప్రకటించాలని డిమాండ్​ చేశాయి. రోజు కూలీ మీద జీవించే కార్మికుల పరిస్థితి ప్రస్తుతం మరింత దయనీయంగా మారిందని లేఖలో ప్రస్తావించారు. పౌరసరఫరాల శాఖ ద్వారా నిత్యావసర సరుకులు వెంటనే అందచేయాలని కోరారు.

ABOUT THE AUTHOR

...view details