తెలంగాణ

telangana

ETV Bharat / bharat

దేశంలో 1000 దాటిన కరోనా కేసులు.. 27 మంది మృతి

corona live updates
కరోనా పంజా

By

Published : Mar 29, 2020, 9:22 AM IST

Updated : Mar 29, 2020, 10:56 PM IST

22:22 March 29

ఇటలీలో మరో 750మందికిపైగా...

కరోనా వైరస్​ ప్రభావం తీవ్రంగా ఉన్న ఇటలీలో ఆదివారం మరో 756 మంది మృత్యువాతపడ్డారు. మొత్తం మరణాల సంఖ్య 10 వేల 779కి చేరింది. కొత్తగా 5,217 కేసులు నమోదుకాగా.. మొత్తం కేసులు లక్షకు చేరువయ్యాయి. 

20:46 March 29

మరో ఆర్మీ డాక్టర్​కు కరోనా నిర్ధరణ

ఆర్మీలో జూనియర్​ డాక్టర్​గా విధులు నిర్వర్తిస్తున్న ఒకరికి కరోనా పాజిటివ్​ వచ్చినట్లు అధికారులు తెలిపారు. అయితే అతడు శ్రీనగర్​లో పనిచేస్తుండగా.. తాజా కేసుతో కలిపి మొత్తం ఇద్దరు ఆర్మీ డాక్టర్లకు వైరస్​ సోకింది.

20:40 March 29

దిల్లీ మరో 23మందికి కరోనా పాజిటివ్​

దిల్లీలో మరో 23మందికి  కరోనా సోకినట్లు ఆరోగ్య వర్గాలు తెలిపాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 72కు చేరినట్లు పేర్కొన్నాయి. 

20:26 March 29

కరోనా వైరస్​ వల్ల ఉత్పన్నమయ్యే పరిస్థితులపై రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఆధ్యర్వంలో కేంద్ర మంత్రి వర్గం సమీక్షించింది.  

21 రోజుల లాక్​డౌన్​ నేపథ్యంలో అమలు చేస్తున్న చర్యలపై మంత్రి వర్గం చర్చించింది.

ఇంధన వనరులు భారత్​లో అవసరాలకు తగ్గట్లు ఉన్నట్లు మంత్రివర్గం నిర్ధరణకు వచ్చింది.  

నిత్యావసర వస్తువుల రవాణాను రైలు, రహదారి మార్గాల ద్వారా సజావుగా సాగేలా ఏర్పాట్లు చేయాలని, స్థానికంగా తలెత్తే ఏ సమస్య అయినా పరిష్కరించాలని మంత్రివర్గం నిర్ణయించింది.

20:06 March 29

దేశంలో కరోనా మరణాల సంఖ్య మరింత పెరిగింది. మొత్తం 27 మంది ప్రాణాలు కోల్పోయినట్లు కేంద్ర వైద్య శాఖ ప్రకటించింది.

భారత్​లో కరోనా వైరస్​ బారిన పడి మరణించిన వారి సంఖ్య 27కు చేరింది. కేంద్ర వైద్య, కుటుంబ సంక్షేమ శాఖ ఈమేరకు తాజా గణాంకాలు వెల్లడించింది.

మొత్తం మరణాలు: 27

యాక్టివ్ కేసుల సంఖ్య: 901

కోలుకున్న వారి సంఖ్య: 95

మహారాష్ట్రలో 8 మంది...

ముంబయి, బుల్దానా జిల్లాలో శనివారం ఇద్దరు మరణించారు. ఆ ఇద్దరికీ కరోనా సోకినట్లు ఆలస్యంగా నిర్ధరించారు వైద్యులు. ఫలితంగా ఆ రాష్ట్రంలో వైరస్​ కారణంగా మృతిచెందిన వారి సంఖ్య 8కి చేరింది.  

కర్ణాటకలో కొత్తగా 7, బిహార్​లో 4 కరోనా కేసుల నమోదయ్యాయి.

20:01 March 29

ఆర్మీ డాక్టర్​కు కరోనా పాజిటివ్​

కోల్​కత్తాలోని ఆర్మీ కమాండ్​ ఆస్పత్రిలో కల్నన్​ హోదా ర్యాంకులో పని చేస్తున్న ఒక డాక్టర్​కు కరోనా సోకినట్లు ఆర్మీ వర్గాలు తెలిపాయి. సదరు డాక్టర్​ ఇటీవల దిల్లీకి వెళ్లారు. అయితే అప్పటి నుంచి ఆయన క్వారంటైన్​లో ఉంటున్నారు. అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు.  తన స్నేహితుల పట్ల కూడా జాగ్రత్తగా ఉంటున్నారు. 

19:54 March 29

గుజరాత్​లో మరో ఐదుగురికి కరోనా  

గుజరాత్​లో మరో ఐదుగురు కరోనా బారిన పడ్డారు. దీంతో రాష్ట్రంలో కేసుల సంఖ్య 63కు చేరినట్లు ఆరోగ్య వర్గాలు తెలిపాయి.  ఇద్దరు బాధితులు వెంటిలేటర్​ మీద ఉండగా.. ఒకరు డిశ్చార్జ్​ అయినట్లు వెల్లడించాయి.

19:44 March 29

సీఎస్​లకు కేంద్ర హోంశాఖ కార్యదర్శి లేఖ

కరోనా విజృంభన వేళ కేంద్రం తీసుకుంటున్న చర్యల అమలుపై అన్ని రాష్ట్రాల సీఎస్​లు, కేంద్రపాలిత ప్రాంతాల (యూటీ) ప్రధాన కార్యదర్శులకు లేఖ రాశారు కేంద్ర హోం శాఖ కార్యదర్శి అజయ్ భల్లా. కేంద్ర ప్రభుత్వ నిర్ణయాల అమలు తీరుపై ఆ లేఖలో వివరణ కోరారు.

19:31 March 29

బీహార్​ మరో నలుగురికి కరోనా పాజిటివ్​

బీహార్​లో మరో నలుగురికి కరోనా వైరస్​ సోకింది. దీంతో రాష్ట్రంలో కేసుల సంఖ్య 15కు చేరింది. తాజాగా కేసులు జవహర్​లాల్​ నెహ్రూ మెడికల్​ కాలేజీ, భాగల్​పూర్​ ఆస్పత్రుల్లో  నమోదయ్యాయి.

19:27 March 29

మహారాష్ట్రలో 8కి చేరిన కరోనా మృతులు

మహారాష్ట్రలో ఆదివారం కరోనాతో ఇద్దరు మృతి చెందారు. దీంతో రాష్ట్రంలో మృతుల సంఖ్య 8కి చేరింది.  

19:23 March 29

అదానీ రూ. 100కోట్ల విరాళం

కరోనాపై పోరుకు ప్రముఖ వ్యాపారవేత్త అదానీ  పీఎం కేర్స్‌ నిధికి రూ.100 కోట్ల విరాళం ప్రకటించారు.

19:21 March 29

హిమాచల్​ప్రదేశ్‌లో చిక్కుకున్న 480 మంది

కరోనా వ్యాప్తి నేపథ్యంలో విధించిన లాక్​డౌన్​ కారణంగా  ప్రస్తుతం హిమాచల్ ప్రదేశ్‌లో పలువురు చిక్కుకుపోయారు. 240 మంది పర్యటకులు, 100 మంది భారతీయ పౌరులు, 140 మంది విదేశీ పౌరులు ఎటూ వెళ్లలేక అక్కడ బిక్కు బిక్కుమంటూ సాయం కోసం  ఎదురు చూస్తున్నారు.

19:14 March 29

మహారాష్ట్రలో 203కు చేరిన కేసులు  

మహారాష్ట్రలో మరో 7 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో కేసుల సంఖ్య 203కి చేరింది.

19:10 March 29

తమిళనాడులో ఎనిమిది కొత్త కేసులు

తమిళనాడులో మరో  ఎనిమిది మందికి కరోనా సోకినట్లు నిర్ధరణ అయ్యింది.  వారందరూ రాష్ట్రంలోని ఈరోడ్​ ప్రాంతానికి చెందిన వారే. అయితే వీరు పెరుందురాయిలోని ఐఆర్​టీలో కరోనా చికిత్స తీసుకుంటున్న థాయ్​లాండ్​ దేశస్థులను కలిసినట్లు సమాచారం. థాయ్​లాండ్​ దేశస్థులను కలిసిన మిగతా వారి జాడ కోసం వెతుకుతున్నట్లు రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి విజయభాస్కర్​.

18:59 March 29

గోవాలో మరో రెండు కేసులు

  • గోవాలో మరో రెండు కరోనా పాజిటివ్ కేసులు నమోదు
  • మొత్తం ఐదుకి చేరిన కరోనా బాధితుల సంఖ్య

18:55 March 29

కర్ణాటకలో మరో 7 కరోనా పాజిటివ్​ కేసులు

కర్ణాటకలో తాజాగా మరో 7 కరోనా కేసులు నమోదయ్యాయి. గత 21గంటల్లో ఈ  కేసులు నమోదైనట్లు ఆ రాష్ట్ర అధికారులు తెలిపారు. దీంతో కర్ణాటకలో మొత్తం కేసుల సంఖ్య 83కి చేరింది. అలాగే ఐదుగురు డిశ్చార్జ్​ కాగా.. ముగ్గురు మృతి చెందినట్లు వెల్లడించారు.

18:47 March 29

వలస కూలీలు వసతి శిబిరాల్లో ఉండాలి: దిల్లీ సీఎం కేజ్రీవాల్ 

వలస కూలీలకు అన్ని రకాల వసతులు కల్పిస్తాం: సీఎం కేజ్రీవాల్‌

వలస కూలీలకు క్రీడా మైదానాలు, పాఠశాలల్లో వసతి : సీఎం కేజ్రీవాల్‌

4 లక్షలమంది వలస కూలీలకు తాత్కాలిక వసతి, భోజనం అందజేస్తాం: కేజ్రీవాల్‌

లాక్‌డౌన్‌ నినాదం ఎక్కడివారు అక్కడే ఉండటం: సీఎం కేజ్రీవాల్‌

లాక్‌డౌన్‌ విజయవంతం చేస్తే కరోనాపై యుద్ధంలో గెలుస్తాం: సీఎం కేజ్రీవాల్‌

18:36 March 29

  • కేంద్ర హోంమంత్రి అమిత్ షా నివాసంలో ఉన్నత స్థాయి సమావేశం
  • కొవిడ్ 19 ని ఎదుర్కొనేందుకు చేపట్టిన కార్యక్రమాల అమలు, వివిధ రాష్ట్రాల్లో పరిస్థితి, నిర్బంధ పరీక్ష కేంద్రాల ఏర్పాట్లు, వైద్య, ఇతర మౌలిక సదుపాయాల కల్పన పై చర్చ
  • భేటీకి హాజరైన సీనియర్ మంత్రులు రాజనాథ్ సింగ్, రామ్ విలాస్ పాసవాన్, స్మృతి ఇరానీ, నరేంద్ర సింగ్ తోమర్, ధర్మేంద్ర ప్రధాన్, హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి, హోం శాఖ కార్యదర్శి భల్లా, ప్రధాని కార్యాలయ అధికారులు.

18:16 March 29

20కొత్త కేసులు...

కేరళలో 20 కొత్త కేసులు నమోదయ్యాయి. దీనితో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 181కు చేరింది. ఈ వివరాలను ఆ రాష్ట్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది.

17:55 March 29

కేరళలో మరో 20 కరోనా పాటిజివ్​ కేసులు

కేరళలో కరోనా కేసులు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. రాష్ట్రంలో తాజాగా మరో 20 కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 181కి చేరింది.

17:20 March 29

కరోనాపై పోరుకు రాజ్యసభ సభ్యులు సహకరించాలి: వెంకయ్య

కరోనాపై పోరుకు రాజ్యసభ సభ్యులు కలిసిరావాలన్నారు ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు. ప్రతి సభ్యుడు ఒక నెల వేతనాన్ని పీఎం కేర్స్​ నిధికి విరాళంగా అందించాలని కోరారు.  

17:13 March 29

కేంద్ర కేబినెట్​ సమావేశం..

కరోనా నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించేందుకు కేంద్ర కేబినెట్ ఉన్నతస్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేసింది. రక్షణ శాఖ మంత్రి రాజ్​నాథ్​ సింగ్​ నివాసంలో కేంద్ర మంత్రులు, అమిత్​ షా, ప్రకాశ్​ జావడేకర్, ధర్మేంద్ర ఇతర మంత్రులు సమావేశానికి హాజరయ్యారు.

17:03 March 29

పేదలకు ఆహారం పంపిణీ  

బీహార్​ పాట్నాలో రైల్వే రక్షణ దళం పేదలకు ఆహారం పంపిణీ చేసింది. తమ సిబ్బంది స్వయంగా ఐఆర్‌సీటీసీ వంటశాలలో వండిన ఆహారాన్ని పేదలకు పంపిణీ చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. తాము సామాజిక దూరం పాటిస్తూ.. ప్రజలకు ఆలా పాటించాలని సూచిస్తున్నట్లు వెల్లడించారు అధికారులు.

16:57 March 29

పారమిలటరీ సిబ్బంది రూ. 116కోట్ల విరాళం..

పీఎం కేర్స్​ నిధికి పారమిలటరీ సిబ్బంది తమ ఒకరోజు వేతనాన్ని విరాళంగా అందజేశారు. ఈ మేరకు రూ.116కోట్ల విలువైన చెక్కును అధికారులు హోం మంత్రి అమిత్​ షాకు అందజేశారు.

16:39 March 29

రక్షణ శాఖ ఉద్యోగుల భారీ విరాళం

కరోనా నివారణకు పీఎం కేర్స్​ నిధికి రక్షణ శాఖ ఉద్యోగులు ఒకరోజు వేతనం విరాళంగా అందజేశారు.  రక్షణశాఖ ఉద్యోగుల తమ ఒకరోజు వేతనం సుమారు రూ.500 కోట్లు అందజేయాలని నిర్ణయించారు.

16:28 March 29

వైరస్​ తీవ్రంగా ఉన్న ప్రాంతాలను గుర్తిస్తున్నాం: కేంద్ర ఆరోగ్య శాఖ

  • కరోనా ప్రభావం ఎక్కువగా ఉన్న ప్రాంతాలను గుర్తించేందుకు ప్రయత్నం.
  • ఆస్పత్రిల్లో కరోనా బాధితులు, ఇతర రోగులను వేరుచేసేందుకు కొనసాగుతున్న ప్రక్రియ.
  • రైల్వే గూడ్స్‌ ద్వారా ఆహార ధాన్యాలు, చక్కెర, ఉప్పు, బొగ్గు, పెట్రోలియం సరఫరా.
  • గత 5 రోజుల్లో 1.25 లక్షల వ్యాగన్ల ద్వారా నిత్యావసర వస్తువుల సరఫరా.
  • కరోనా నివారణ చర్యలపై మార్గదర్శకాల కోసం 10 బృందాలు ఏర్పాటు.
  • ఈ బృందాలు వైద్య అత్యవసర సేవలు, ఐసోలేషన్‌ వార్డులు వంటి వాటిపై మార్గదర్శకాలు ఇస్తాయి.
  • ఇప్పటివరకు 34,931 మంది అనుమానితులకు పరీక్షలు.
  • దేశవ్యాప్తంగా ల్యాబ్‌లు పెంపు.
  • ప్రస్తుతం ఉన్న 113 ల్యాబ్‌లకు అదనంగా మరో 47 ప్రైవేటు ల్యాబ్‌లకు అనుమతి.
     

16:23 March 29

దేశంలో కరోనా కేసులు 979కి చేరుకున్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది.  అందులో 25మంది మృత్యువాత పడినట్లు వెల్లడించింది. గత 24గంటల్లో దేశంలో 106 పాజిటివ్​ కేసులు నిర్ధరణ అయినట్లు, ఆరుగురు చనిపోయినట్లు ఆరోగ్యశాఖ పేర్కొంది.  

16:15 March 29

క్వారంటైన్​లో ఉన్న వ్యక్తి మృతి

కేరళలో క్వారంటైన్​లో ఉన్న వ్యక్తి మృతి చెందారు. వృత్తిరీత్యా ఆయన లారీ డ్రైవర్​ కాగా.. ఇటీవల ముంబయినుంచి వచ్చారు. దీంతో అధికారులు అతడిని క్వారంటైన్​లో ఉంచారు. ఈ సమయంలోనే ఆయన మృత్యువాత పడ్డారు. అయితే ఆయనకు కరోనా సోకినట్లు ఇంకా నిర్ధరణ కాలేదు.

15:44 March 29

మహారాష్ట్రలో కరోనా నుంచి కోలుకున్న 34మంది..

మహారాష్ట్రలో ఇప్పటివరకు 34మంది కరోనా వైరస్​ నుంచి కోలుకున్నారు. ముంబయిలో 14మంది, పుణెలో 15, నాగ్​పూర్​లో ఒకరు, 1, ఔరంగబాద్​లో ఒకరు, యావత్మల్​లో ముగ్గురు వైరస్​ నుంచి కోలుకొని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్​ అయినట్లు ఆ రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలో 155మంది యాక్టివ్​ కేసులు ఉన్నట్లు వెల్లడించారు.

15:27 March 29

స్పెయిన్​లో 838మంది మృతి..

స్పెయిన్​, ఇరాన్​లో కరోనా మరణాలు రోజురోజుకు రెట్టింపు అవుతున్నాయి. 24గంటల్లోనే 838 మంది చనిపోవడం అక్కడ వైరస్​ తీవ్రతకు అద్దం పడుతుంది. అలాగే ఇరాన్​లో 123మంది మృతి చెందగా.. మొత్తం మరణాలు 2,640కు చేరుకున్నాయి.  

15:21 March 29

లాక్​డౌన్​ నిబంధనలను లెక్క చేయని వారిపై కొరడా ఝులిపించాలని కేంద్రం నిర్ణయించింది. లాక్​డౌన్​ ఉల్లంఘించిన వారిని 14రోజుల పాటు క్వారంటైన్​ను పంపాలని రాష్ట్రాలకు ఆదేశాలు జారీ చేసింది.

15:12 March 29

బిహార్​లో మహిళకు కరోనా..

బిహార్​లో మరో కరోనా కేసు నమోదైంది. తాజాగా మహిళకు పాజిటివ్​ అని నిర్ధరణ కాగా.. మొత్తం కేసుల సంఖ్య 11కు చేరింది.

14:54 March 29

యూపీలో మరో నలుగురికి కరోనా పాజిటివ్​

ఉత్తర్​ప్రదేశ్​లోని గౌతమ బుద్ధ నగర్​ జిల్లాలో మరో  నాలుగు కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో జిల్లాలో  వైరస్​ సోకిన వారి సంఖ్య 31కి చేరింది.

14:43 March 29

కోటక్​ మహీంద్ర బ్యాంకు రూ. 50కోట్ల విరాళం..

కరోనాపై పోరాడేందుకు పీఎం కేర్స్​ నిధికి కోటక్​ మహీంద్ర బ్యాంకు ఎండీ ఉదయ్​ రూ. 50కోట్ల విరాళం ప్రకటించారు. ఉదయ్​ వ్యక్తిగతంగా రూ. 25కోట్లు, బ్యాంకు తరఫున రూ. 25కోట్లు  ఇస్తున్నట్లు కోటక్​ మహీంద్ర బ్యాంకు వర్గాలు తెలిపాయి.

14:36 March 29

ప్రధాని మోదీకి రాహుల్​ లేఖ..

కరోనా ఎదుర్కొనే విషయంలో ప్రధాని మోదీకి కాంగ్రెస్​ నేత రాహుల్​ పలు సూచలను చేస్తూ లేఖ రాశారు. సంక్షోభాన్ని అధిగమించే అంశంలో కేంద్రానికి అండగా ఉంటామని చెప్పారు రాహుల్​ గాంధీ.

14:22 March 29

రాష్ట్రపతి విరాళం

  • పీఎం సహాయనిధికి రాష్ట్రపతి రాంనాథ్‌ కోవింద్‌ విరాళం
  • కరోనా నివారణకు నెల వేతనం విరాళంగా ప్రకటించిన రాష్ట్రపతి
  • రాష్ట్రపతి నిర్ణయానికి కృతజ్ఞతలు తెలిపిన ప్రధాని మోదీ

14:20 March 29

జేఎస్​డబ్ల్యూ రూ. 100కోట్ల విరాళం..

కరోనా వైరస్​ను ఎదుర్కొనేందుకు ప్రముఖ స్టీల్​ వ్యాపార సంస్థ జేఎస్​డబ్ల్యూ పీఎం కేర్స్​ నిధికి  రూ. 100కోట్ల విరాళం ప్రకటించింది. 

14:03 March 29

కేంద్రం  తాజా ఆదేశాలు

  • రాష్ట్ర, జిల్లాల సరిహద్దులను తప్పనిసరిగా మూసివేయాలని ఆదేశాలు జారీ చేసిన కేంద్రం.
  • సరుకు రవాణా మినహా జాతీయ రహదారులు, పట్టణాల్లో ఎటువంటి రవాణా జరగరాదు.
  • జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు దీనికి బాధ్యత వహించాలి.
  • సమయానుకూలంగా దినసరి కూలీలకు చెల్లింపులు జరపాలి. చెల్లింపులను ఒక్క రోజు కూడా ఆలస్యం చేయొద్దు.
  • విద్యార్థులు, అద్దెకు ఉండే వారికి అవసరమైన సహకారాన్ని ఇవ్వాలని, అద్దె డిమాండ్ చేసే ఇంటి యజమానులపై చర్యలకు వెనుకాడవద్దని సూచన.
  • సరిహద్దుల్లో ఉన్న దినసరి కూలీలను వెంటనే... 14 రోజుల పాటు నిర్బంధ పర్యవేక్షణకు పంపాలని కేంద్రం ఆదేశం.
  • అవకాశం ఉన్నంత వరకు జాతీయ రహదారుల పక్కనే నిర్బంధ కేంద్రాలు ఏర్పాటు చేయాలి.
  • రహదారులపై ఒక్క వ్యక్తి కూడా తిరగకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసిన కేంద్రం.

13:56 March 29

దిల్లీలో ఆహారం అందజేత..

దిల్లీలోని నిరుపేదలకు ఆహారాన్ని పంపిణీ చేస్తోంది రాష్ట్ర సర్కారు. న్యూ దిల్లీలోని రైల్వే స్టేషన్​ దగ్గర పోలీసులు నిరాశ్రయిలైన వారికి షల్టర్లు ఏర్పాటు చేసి ఆహారాన్ని అందేజేశారు.  

13:48 March 29

ఫరూఖ్​ అబ్దుల్లా రూ. 1.5కోట్ల కేటాయింపు..  

జమ్ముకశ్మీర్​ నేషనల్​ కాన్ఫరెన్స్​ అధ్యక్షుడు ఫరూఖ్​ అబ్దుల్లా తన ఎంపీ ల్యాడ్స్​ నిధులనుంచి మరో రూ. 1.5కోట్లను శ్రీనగర్​లోని మూడు ఆస్పత్రులకు సమానంగా కేటాయించారు. ఇది వరకే ఆయన రూ. 1కోటి నిధులను కరోనాను ఎదుర్కొనేందుకు కేటాయించారు.  

13:37 March 29

రైల్వే సిబ్బంది రూ.151 కోట్ల విరాళం..  

కరోనా సంక్షోభం నేపథ్యంలో దేశంలోని రైల్వే సిబ్బంది పీఎం కేర్స్​ నిధికి  తమ ఒక రోజు వేతనాన్ని విరాళంగా అందజేశారు. దాదాపు 13లక్షల మంది ఉద్యోగులు రూ. 151 కోట్లను విరాళంగా అందజేయనున్నారు. 

13:28 March 29

కేంద్ర రైల్వేశాఖ మంత్రి విరాళం

కేంద్ర రైల్వే శాఖ మంత్రి పియూష్​ గోయల్​, సహాయ మంత్రి సురేష్​ ప్రధానమంత్రి సహాయ నిధికి ఒక నెల వేతనం విరాళంగా అందజేశారు.

13:23 March 29

కరోనా లక్షణాలతో పంజాబ్​లో ఒకరు మృతి

పంజాబ్​లో కరోనా లక్షణాలతో ఒకరు మృతి చెందారు. నిర్ధరణ కోసం అతడి నమూనాలను సేకరించిన అధికారులు పరీక్షలకు పంపారు. ఫలితాలు వచ్చిన తర్వాత అతడికి వైరస్​ సోకిందా, లేదా అనేది నిర్ధరణ కానుంది.

13:09 March 29

శనివారం మహారాష్ట్రలో చనిపోయిన 40 ఏళ్ల మహిళ.. కరోనా కారణంగా మృతి చెందినట్లు అధికారులు వెల్లడించారు. ఫలితంగా రాష్ట్రంలో కొవిడ్​-19 మృతుల సంఖ్య 7కు చేరింది

  • ముంబయి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ నిన్న 40 ఏళ్ల మహిళ మృతి
  • మరణానంతరం నిర్వహించిన పరీక్షల్లో కరోనా నిర్ధారణ
  • మహారాష్ట్రలో ఇప్పటివరకు కరోనాతో ఏడుగురు మృతి
  • మహారాష్ట్రలో మరో 12 కరోనా పాజిటివ్ కేసులు నమోదు
  • మహారాష్ట్రలో మొత్తం 193కి చేరిన కరోనా బాధితుల సంఖ్య

12:34 March 29

జమ్ముకశ్మీర్​లో మరో ఐదుగురికి పాజిటివ్​..  

జమ్ముకశ్మీర్​లో మరో ఐదుగురు కరోనా బారిన పడ్డారు. శ్రీనగర్​లో రెండు, బుద్గామ్​లో రెండు, బారాముల్లాలో ఒకటి చొప్పున తాజా పాజిటివ్​ కేసులు నమోదయ్యాయి.

12:13 March 29

పీఎఫ్ నిధి నుంచి 75 శాతం తీసుకోవచ్చు

కరోనా వ్యాప్తి, లాక్​డౌన్​ నేపథ్యంలో ఉద్యోగి పీఎఫ్ నిధి నుంచి 75 శాతం వరకు తీసుకునే అవకాశం కల్పించింది కేంద్రం. ఈ విషయంపై ఇటీవల కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలాసీతారామన్ ప్రకటన చేయగా.. తాజాగా గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేశారు.

12:03 March 29

సీబీఎస్​ఈ సిబ్బంది రూ.21లక్షల విరాళం  

ప్రధానమంత్రి కేర్స్​ సహాయనిధికి సీబీఎస్​ఈ సిబ్బంది విరాళం ప్రకటించారు. గ్రూప్​ ఏ, బీ, సీ ఉద్యోగులందరూ కలిసి రూ.21లక్షల విరాళాన్ని  ఇస్తున్నట్లు  ప్రకటించారు.

11:58 March 29

వరుణ్‌తేజ్‌, శర్వానంద్​ విరాళం..

లాక్​ డౌన్​ నేపథ్యంలో సినీ కార్మికుల సంక్షేమం కోసం మెగా హీరో వరుణ్​ తేజ్​ రూ.20 లక్షలు విరాళం ప్రకటించారు. అలాగే మరో హీరో శర్వానంద్‌ రూ.15 లక్షల విరాళం ప్రకటించారు.

11:53 March 29

పైలెట్​కు కరోనా పాటిజివ్​  

స్పైస్​జెట్​ విమానయాన సంస్థకు చెందిన పైలెట్​కు కరోనా పాజిటివ్​ అని నిర్ధరణ అయ్యింది. అయితే అతడు మార్చిలో అంతర్జాతీయ విమానాల్లో ఎలాంటి ప్రయాణం చేయలేదని  స్పైస్​జెట్​  తెలిపింది.

11:47 March 29

సైనికులుగా పోరాటం..

కరోనా వైరస్​పై ఎంతోమంది సైనికులుగా పోరాటం చేస్తున్నారన్నారు మోదీ. ముఖ్యంగా నర్సులు, డాక్టర్లు, పారమెడికల్​ సిబ్బంది ముందుండి పోరాడుతున్నారన్నారు.

11:30 March 29

కరోనాపై గెలిచిన హైదరాబాదీకి మోదీ ఫోన్​

దేశంలో కరోనా కట్టడికి కఠిన నిర్ణయాలు తీసుకోవడం తప్పలేదని చెప్పారు ప్రధాని. అయితే ఈ నిర్ణయాలతో కష్టపడుతున్న ప్రజలు, ముఖ్యంగా పేదలు తనను క్షమించాలన్నారు. వైరస్​ను జయించిన వారు, చికిత్స అందిస్తున్న వైద్యులతో 'మనసులో మాట' కార్యక్రమం ద్వారా మాట్లాడిన మోదీ.. వారి అనుభవాలు దేశానికి స్ఫూర్తిగా నిలవాలని ఆకాంక్షించారు.

వైరస్​పై పోరులో.. కఠిన నిర్ణయాలతో కష్టపడ్డ దేశప్రజలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ క్షమాపణలు తెలిపారు. ముఖ్యంగా పేదలు తనను మన్నించాలని కోరారు. అయితే.. కరోనా వైరస్​తో పోరును చావు-బతుకుల పోరాటంగా అభివర్ణించిన మోదీ.. కఠిన నిర్ణయాలు తీసుకోక తప్పలేదని స్పష్టం చేశారు.'మనసులో మాట' కార్యక్రమం ద్వారా ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు మోదీ.  

వైరస్​ను తొలినాళ్లల్లోనే అరికట్టాల్సిన ఆవ్యశ్యకత ఉందన్నారు. ఇందుకు భారతీయులు ఎంతో కృషి చేస్తున్నారని ప్రశంసించారు.'భయపడాల్సిన అవసరం లేదు..'కరోనా నుంచి కోలుకున్న ఓ హైదరాబాద్​ వాసితో మోదీ సంభాషించారు. తనకు వైరస్​ సోకినట్టు తెలిసిన తర్వాత.. కొంత భయపడ్డానని, కానీ వైద్యులు తనలో ధైర్యాన్ని నింపారని తెలిపారు ఆ వ్యక్తి. భయపడాల్సిన అవసరం లేదని.. కోలుకునే అవకాశాలే ఎక్కువని హైదరాబాద్​వాసి ధీమాగా చెప్పారు.తన అనుభవాన్ని సామాజిక మాధ్యమాల్లో పంచుకోవాలని ఆ హైదరాబాద్​వాసిని మోదీ కోరారు. ఇది వైరల్​ అయితే.. ప్రజల్లో అవగాహనతో పాటు ధైర్యం కూడా పెరుగుతుందన్నారు.

11:22 March 29

మనల్ని మనం రక్షించుకోవడం కష్టం: మోదీ

లాక్​డౌన్​ నిబంధనలను ఉద్దేశపూర్వకంగా ఎవరూ ఉల్లంఘించరనే విషయం తనకు తెలుసు అన్నారు మోదీ. అయితే ఉద్దేశపూర్వకంగా ఉల్లంఘించేవారు కూడా కొందరు ఉన్నారని వ్యాఖ్యానించారు. లాక్​డౌన్​ను అనుసరించకపోతే కరోనా వైరస్ నుంచి మనల్ని మనం రక్షించుకోవడం చాలా కష్టమన్నారు.

11:10 March 29

దేశంలో కరోనా వ్యాప్తి నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్​కీబాత్​లో మాట్లాడుతున్నారు.  

కరోనా వైరస్​ను ప్రారంభంలోనే నివారించాలన్నారు ప్రధాని మోదీ. ఇప్పుడు భారతదేశం మొత్తం ఆ పనిలోనే ఉందన్నారు.  

కరోనాపై పోరాటం అనేది ఒక జీవిత కాల యుద్ధం లాంటిదన్నారు ప్రధాని మోదీ.

ప్రజలు, పేదలకు లాక్​ డౌన్​ నిర్ణయం కష్టతరమైనా తప్పలేదన్నారు. తనను క్షమించాలని కోరారు.

10:52 March 29

గుజరాత్​లో​ మరో మూడు పాజిటివ్​ కేసులు..

గుజరాత్​లో మరో మూడు కరోనా పాజిటివ్​ కేసులు నమోదయ్యాయి. దీంతో కేసుల సంఖ్య 58కి చేరినట్లు అధికారులు తెలిపారు.

10:35 March 29

స్వస్థలాలకు వెళ్లవద్దు: కేజ్రీవాల్​  

కరోనా వ్యాప్తి నేపథ్యంలో వలస కార్మికులు తమ స్వస్థలాలకు వెళ్లవద్దని దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ విజ్ఞప్తి చేశారు. దేశ ప్రయోజనాల దృష్ట్యా ప్రజలు ఆలోచించాలన్నారు.

10:21 March 29

దేశంలో కరోనా మహమ్మారి మృతుల సంఖ్య 25కు చేరింది. కేంద్ర ఆరోగ్యశాఖ సమాచారం ప్రకారం దేశవ్యాప్తంగా ప్రస్తుతం 867 యాక్టివ్​ కేసులున్నాయి. మరో 86 మంది ఈ మహమ్మారి నుంచి కోలుకున్నట్లు తెలుస్తోంది.

10:18 March 29

మహారాష్ట్రలో మరో 12మందికి కరోనా పాజిటివ్​

మహారాష్ట్రలో మరో 12మందికి కరోనా పాజిటివ్​ అని తేలింది. దీంతో ఆ రాష్ట్రంలో మహమ్మారి సోకిన వారి సంఖ్య 193కు చేరినట్లు అధికారులు తెలిపారు.

09:39 March 29

కరోనాతో జమ్ముకశ్మీర్​లో మరొకరు మృతి చెందారు. వైరస్​ సోకి శ్రీనగర్​ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ అతడు మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. దీంతో జమ్ముకశ్మీర్​ కరోనా మృతుల సంఖ్య 2కు చేరింది.

09:19 March 29

ఇటలీలో మరో 756 మంది మృతి.. లక్షకు చేరువైన కేసులు

కరోనా వైరస్​కు మరొకరు బలయ్యారు. గుజరాత్​ అహ్మదాబాద్​లో 45 ఏళ్ల రోగి ప్రాణాలు కోల్పోయాడు. ఆయన ఇప్పటికే మధుమేహంతో బాధపడుతున్నట్లు తెలిపారు వైద్యులు.

గుజరాత్​లో కరోనా కారణంగా ఇప్పటివరకు మొత్తం ఐదుగురు మరణించినట్లు తెలిపింది ఆ రాష్ట్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ.

Last Updated : Mar 29, 2020, 10:56 PM IST

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details