కర్ణాటకలో పోలీసు శాఖలోనూ కరోనా కేసులు భారీగా నమోదవుతున్నాయి. ఇది వరకు కిందిస్థాయి పోలీసులకు వైరస్ పాజిటివ్‌గా వస్తే.. ఆ స్టేషన్లు మూసివేశారు. అయితే బెంగళూరు నగర పోలీసు కమిషనర్ కార్యాలయంలోని మూడో అంతస్తులో కొవిడ్ కేసు బయటపడింది. దీంతో ఆ భవనాన్ని మూడు రోజుల పాటు మూసివేస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేశారు అధికారులు. కార్యాలయంలోకి ప్రజలు, ఇతర సిబ్బందికి కూడా అనుమతి నిరాకరించారు.
పోలీస్ కమిషనర్ కార్యాలయంలో కరోనా కలకలం
కర్ణాటక కరోనా బాధితుల్లో పోలీసుల సంఖ్య ఎక్కువవుతోంది. బెంగళూరు నగర పోలీసు కమిషనర్ కార్యాలయంలో వైరస్ కలకలం రేపింది. భవనంలోని మూడో అంతస్తులో ఓ అధికారికి కొవిడ్ పాజిటివ్ అని తేలింది. దీంతో కార్యాలయ్యాన్ని మూడు రోజుల పాటు మూసివేస్తున్నట్లు ప్రకటించారు అధికారులు.
పోలీసు కమిషనర్ కార్యాలయంలో కరోనా కలకలం
మరోవైపు దోపిడీకి యత్నించిన ఇద్దరు నిందితులను నందిని లేఅవుట్ స్టేషన్ పోలీసులు ఇటీవల అరెస్ట్ చేశారు. ఆ నిందితులకు జూన్ 23న వైరస్ పరీక్ష నిర్వహించగా.. వారికి కరోనా సోకినట్లు తేలింది. నిందితులతో సన్నిహితంగా ఉన్న మరో 10మందిని క్వారంటైన్ కేంద్రాలకు తరలించారు.
ఇదీ చూడండి:జులై 1 నుంచి మెట్రో సర్వీసుల పునరుద్ధరణ!