మహారాష్ట్రలో కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. శుక్రవారం ఒక్కరోజే 6,364 మందికి వైరస్ నిర్ధరణ అయింది. 198మంది కొత్తగా ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటివరకు 1,92,990 మంది వైరస్ బారినపడ్డారు. మృతుల సంఖ్య 8376కు చేరింది. యాక్టివ్ కేసుల సంఖ్య 79, 927గా ఉంది. అయితే తాజాగా 3,515మంది వైరస్ నయమై ఆస్పత్రుల నుంచి డిశ్ఛార్జి అయ్యారు. మొత్తంగా 1,04,687 మందికి వైరస్ నయమైంది. రాష్ట్రంలో ఇప్పటివరకు 10,49,227 వైరస్ పరీక్షలు నిర్వహించారు.
తమిళనాడులో కొత్తగా 4వేలమందికి..
తమిళనాడులో కరోనా విలయం సృష్టిస్తోంది. గత 24 గంటల వ్యవధిలో కొత్తగా 4,329 కేసులు నిర్ధరణ అయినట్లు తమిళనాడు వైద్య శాఖ ప్రకటించింది. దీంతో రాష్ట్రంలో కేసుల సంఖ్య 1,02,721కి చేరింది. కొత్త కేసుల్లో 2,082 మంది బాధితులను చెన్నైలోనే గుర్తించినట్లు అధికారులు తెలిపారు.
కర్ణాటకలో ఒక్కరోజులో 1,694 మందికి..
రాష్ట్రంలో కొత్తగా 1,694 మందికి వైరస్ నిర్ధరణ అయింది. దీంతో అక్కడ వైరస్ బాధితుల సంఖ్య 17,710కి పెరిగింది. ఒక్కరోజులో 21మంది ప్రాణాలు కోల్పోయారు. మొత్తంగా మరణాల సంఖ్య 293కు పెరిగింది.
దిల్లీలో 94వేలు దాటిన బాధితులు..
దేశ రాజధాని దిల్లీలో మరో 2,520 మందికి వైరస్ సోకింది. మొత్తంగా 94,000 వేలమందికి వైరస్ నిర్ధరణ అయింది. ఇప్పటివరకు 2,923 మంది ప్రాణాలు కోల్పోయారు.
రాజస్థాన్లో 390 కొత్తగా మందికి..
రాష్ట్రంలో కొత్తగా 390 మందికి వైరస్ నిర్ధరణ అయింది. దీంతో అక్కడ వైరస్ బాధితుల సంఖ్య 19,052కు పెరిగింది. ఒక్కరోజులో 10 మంది ప్రాణాలు కోల్పోయారు. మొత్తంగా మరణాల సంఖ్య 440కి పెరిగింది.