తెలంగాణ

telangana

ETV Bharat / bharat

పార్లమెంట్​లో 10 ఆర్డినెన్స్​లను ప్రవేశపెట్టిన కేంద్రం - LOKSABHA

పార్లమెంట్​లో నేడు పది ఆర్డినెన్స్​లను ప్రవేశపెట్టింది కేంద్రం. ముమ్మారు తలాక్​తో పాటు జమ్ముకశ్మీర్​ రిజర్వేషన్​ వంటి కీలక బిల్లులను ఉభయసభల్లో ప్రవేశపెట్టారు పార్లమెంట్​ వ్యవహారాల సహాయమంత్రులు అర్జున్​ రామ్​ మేఘ్వాల్, వి.మురళీధరన్​.

పార్లమెంట్​లో 10 ఆర్డినెన్స్​లు ప్రవేశపెట్టిన కేంద్రం

By

Published : Jun 20, 2019, 5:49 PM IST

గత లోక్​సభ సమావేశాల్లో ఆమోదం పొందని 10 ఆర్డినెన్స్​లను ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంట్​ సమావేశాల్లో నేడు ప్రవేశపెట్టింది కేంద్రం. కేంద్ర మంత్రిమండలి అంగీకారం తెలిపిన ఈ బిల్లులను లోక్​సభలో పార్లమెంట్​ వ్యవహారాల సహాయమంత్రి అర్జున్​ రామ్​ మేఘ్వాల్ , రాజ్యసభలో వి. మురళీధరన్​ ​ప్రవేశపెట్టారు.

వివాదాస్పద ముమ్మారు తలాక్​తో పాటు భారత వైద్య మండలి, కంపెనీ​, జమ్ముకశ్మీర్​ రిజర్వేషన్​, ఆధార్​, ప్రత్యేక ఆర్థిక జోన్​ సవరణ బిల్లులతో పాటు కేంద్ర విద్యాలయాల్లో అధ్యాపకుల రిజర్వేషన్​, డిపాజిట్​ క్రమబద్దీకరణ ఆర్డినెన్స్​లను ఉభయసభల్లో ప్రవేశపెట్టారు.

ఈ ఆర్డినెన్స్​లు 45 రోజుల్లో చట్టసభల ఆమోదం పొందకపోతే వీటి కాలపరిమితి ముగుస్తుంది.

ఇదీ చూడండి : మాజీ ఐపీఎస్​ సంజీవ్​ భట్​కు జీవితఖైదు

ABOUT THE AUTHOR

...view details