ఉత్తరాది రాష్ట్రాలు ఈ ఏడాది మార్చిలో చల్లగా ఉన్నాయని భారత వాతవరణ శాఖ వెల్లడించింది. ఆ ప్రాంతాల్లో వర్షాలు కురవడమే ఇందుకు కారణమని తెలిపింది. దక్షిణాది సహా ఈశాన్యంలోని కొన్ని ప్రాంతాల్లో మాత్రం సాధారణం కంటే అధిక ఉష్ణోగ్రతలు నమోదైనట్లు పేర్కొంది. మధ్యధరా సముద్రంలో తుపానులే ఈ పరిస్థితి కారణమని వివరించింది ఐఎండీ.
మధ్యధరాలో ఉద్భవించే తుపానులు.... కొండ ప్రాంతాల్లో మంచుకు కారణమవుతాయి. వీటి ప్రభావం మరీ ఎక్కువైతే వర్షం కురుస్తుంది.