తెలంగాణ

telangana

ETV Bharat / bharat

"19-20 నిర్మాణ సాంకేతిక ఏడాది" - నిర్మాణ సాంకేతిక

రాబోయే ఆర్థిక సంవత్సరాన్ని నిర్మాణ సాంకేతిక  సంవత్సరంగా ప్రకటించారు ప్రధానమంత్రి నరేంద్రమోదీ.

రానున్న ఆర్థిక సంవత్సరాన్ని నిర్మాణ సాంకేతికంగా మోదీ ప్రకటన

By

Published : Mar 2, 2019, 8:04 PM IST

రాబోయే ఆర్థిక సంవత్సరాన్ని నిర్మాణ సాంకేతిక సంవత్సరంగా ప్రకటించారు నరేంద్రమోదీ. వేగంగా పెరుగుతున్న నగరీకరణతో ఇళ్లకు డిమాండ్ ఏర్పడింది. పెరిగిన డిమాండ్​ను అందుకునేందుకు నవీన సాంకేతికత వాడకం ద్వారా వేగవంతమైన ఇళ్ల నిర్మాణాన్ని ప్రోత్సహించే దిశగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రధాని తెలిపారు.

2022నాటికి ప్రతి కుటుంబానికి సొంత ఇంటిని నిర్మించాలనే లక్ష్యంతో ముందుకెళ్లనున్నామని వెల్లడించారు మోదీ. వేగవంతమైన గృహనిర్మాణం కోసం రియల్​ ఎస్టేట్ రంగ చట్టాల్ని సవరించటంతో పాటు సాంకేతిక నైపుణ్యాల్ని పెంచుతామన్నారు. భాజపా హయాంలో కోటి 30 లక్షల ఇళ్లను నిర్మించామన్నారు మోదీ.

ABOUT THE AUTHOR

...view details