తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'మానసిక స్థిరత్వంతోనే కరోనాను జయించా' - వెంకయ్యనాయుడు వార్తలు

శారీరక దృఢత్వం, మానసిక స్థిరత్వం, మంచి ఆహారం తీసుకోవటంతోనే కరోనా నుంచి కోలుకోగలిగానని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు చెప్పారు. రోజూ క్రమం తప్పకుండా యోగా, నడవటంతోపాటు సంప్రదాయ ఆహారం తీసుకోవటం వల్ల కరోనాను అధిగమించానని చెప్పుకొచ్చారు.

venkaiah
వెంకయ్యనాయుడు

By

Published : Oct 13, 2020, 9:23 PM IST

ఆరోగ్య సమస్యలు, వయస్సు ఎక్కువగా ఉన్నా కరోనా నుంచి ఎలా కోలుకున్నారో ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు తెలిపారు. శారీరక దృఢత్వం, మానసిక స్థిరత్వం, మంచి ఆహారం తీసుకోవటంతోనే ఈ సమస్యను అధిగమించానని చెప్పుకొచ్చారు. కరోనా సోకిన 136 మంది రాజ్యసభ సెక్రటేరియట్ ఉద్యోగులు కోలుకోవటం పట్ల ఆయన సంతోషం వ్యక్తం చేశారు.

రోజూ క్రమం తప్పకుండా యోగా, నడవటంతోపాటు సంప్రదాయ ఆహారం తీసుకోవటం వల్ల కరోనాని అధిగమించానని ఉపరాష్ట్రపతి చెప్పుకొచ్చారు. ప్రతి ఒక్కరు రోజు శారీరక వ్యాయామాలు చేయాలన్న వెంకయ్య... నడవటం, యోగా చేయటం, ప్రోటీన్‌ ఆహారం తీసుకోవాలని... జంక్‌ ఫుండ్‌ని తీసుకోకూడదన్నారు.

జాగ్రత్తలు పాటించాలి..

ప్రతి ఒక్కరు మాస్కులు ధరించటం, తరచూ చేతులు శుభ్రం చేసుకోవటం, సామాజిక దూరాన్ని పాటించటం లాంటి విషయాల్ని మానకూడదని నొక్కి చెప్పారు. హోం క్వారంటైన్‌లో ఉన్నప్పుడు కొవిడ్‌ మహమ్మారికి సంబంధించి వార్తా పత్రికలు, మ్యాగజైన్లు, ఆర్టికల్స్‌ చదివేందుకు ఎక్కువ సమయం కేటాయించానని వెంకయ్య నాయుడు చెప్పారు.

కొవిడ్‌ నియంత్రణకు ప్రభుత్వం మంచి వ్యూహాం అమలు చేస్తోందని ప్రజలు కరోనా నిబంధనలు పాటించాలని వెంకయ్య అన్నారు. కరోనా జయించటంలో సహకరించిన ప్రతి ఒక్కరికి ఉపరాష్ర్టపతి కృతజ్ఞత తెలిపారు.

ఇదీ చూడండి:టీకా లభ్యత, పంపిణీ వ్యూహాలపై కేంద్ర మంత్రుల భేటీ

ABOUT THE AUTHOR

...view details