తెలంగాణ

telangana

ETV Bharat / bharat

మోదీపై తక్షణ చర్యలు తీసుకోండి: కాంగ్రెస్

మాజీ ప్రధాని రాజీవ్​ గాంధీపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్​ తీవ్రంగా తప్పుబట్టింది. ఈ విషయంపై కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాసింది. మోదీ ఎన్నికల కోడ్​ ఉల్లంఘనకు పాల్పడ్డారని, తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది.

మోదీపై చర్యలు తీసుకోండి: కాంగ్రెస్

By

Published : May 6, 2019, 6:24 AM IST

మోదీపై చర్యలు తీసుకోండి: కాంగ్రెస్

మాజీ ప్రధాని దివంగత నేత రాజీవ్​ గాంధీపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చేసిన విమర్శలపై కాంగ్రెస్​ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇప్పటికే కాంగ్రెస్​ సహా విపక్ష నేతలు మోదీ వ్యాఖ్యలను ఖండించారు. తాజాగా ఈ విషయంపై కేంద్ర ఎన్నికల సంఘానికి కాంగ్రెస్​ లేఖ రాసింది.

ప్రధాని ఎన్నికల కోడ్​ ఉల్లంఘించారని, తక్షణం ఆయనపై చర్యలు తీసుకోవాలని లేఖలో డిమాండ్​ చేసింది.

ఖండించిన ప్రియాంక...

తన తండ్రిపై మోదీ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్​ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రధాని స్థాయిలో ఉన్న వ్యక్తి వద్ద నుంచి ఇలాంటి వ్యాఖ్యలు ఊహించలేదన్నారు. దీనికి ప్రజలే సమాధానం చెప్తారని ట్వీట్‌చేశారు.

"ప్రధాని అమరుల పేర్లు చెప్పుకొని ఓట్లు రాబట్టుకోవాలనుకుంటున్నారు. కానీ ఆ అమరులకు మాత్రం గౌరవం ఇవ్వడం లేదు. రాజీవ్‌గాంధీ ఎవరి కోసమైతే తన జీవితాన్ని త్యాగం చేశారో.. ఆ అమేఠీ ప్రజలే మోదీకి బుద్ధి చెప్తారు. నిజం మోదీజీ.. మోసాన్ని ఈ దేశం ఎప్పుడూ క్షమించదు."
- ప్రియాంక గాంధీ ట్వీట్​

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన బోఫోర్స్ కేసు విచారణలో ఉండగానే రాజీవ్‌గాంధీ మరణించారు. మరణానంతరం ఆయనకు క్లీన్ చిట్ లభించింది. ఈ విషయాన్ని ఉద్దేశిస్తూనే ప్రధాని మోదీ ఘాటైన వ్యాఖ్యలు చేశారు.

ABOUT THE AUTHOR

...view details