తెలంగాణ

telangana

ETV Bharat / bharat

దివ్య స్పందన 'సామాజిక మౌనం' ఎందుకో?

విపక్ష కాంగ్రెస్​ సామాజిక మాధ్యమ విభాగం బాధ్యతల నుంచి దివ్య స్పందన తప్పుకున్నారా అనే అనుమానాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. తన ట్విట్టర్​ ఖాతాలో వృత్తి అనే విభాగం వద్ద సామాజిక మాధ్యమ ఇన్​ఛార్జి అన్న పదం తొలగించడం అనుమానాలకు తావిస్తోంది. ట్విట్టర్​ ఖాతాలో పోస్ట్​లు కనిపించకపోవడం ఊహాగానాలకు బలం చేకూరుస్తోంది.

దివ్య స్పందన 'సామాజిక మౌనం' ఎందుకో?

By

Published : Jun 2, 2019, 11:53 AM IST

Updated : Jun 2, 2019, 12:34 PM IST

కాంగ్రెస్ సామాజిక మాధ్యమ ఇన్​ఛార్జి దివ్య స్పందన ట్విట్టర్​ ఖాతా కొత్త చర్చకు దారితీసింది. ట్విట్టర్ ఖాతాలో వృత్తి అనే చోట తన హోదా వివరాలు తీసేయడం, పోస్ట్​లను తొలగించడంపై రాజకీయ వర్గాలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. కాంగ్రెస్ సామజిక మాధ్యమ విభాగం ఇంఛార్జి దివ్య స్పందన కాంగ్రెస్​ను వీడారా.. పార్టీనే సామాజిక మాధ్యమ బాధ్యతల నుంచి ఆమెను తప్పించిందా.. అని ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.

ఇప్పటికీ సామాజిక మాధ్యమాల బాధ్యులుగా దివ్య స్పందనే కొనసాగుతున్నారా.. పార్టీ మరెవరినైనా నియమించిందా అనే విషయంలో సందిగ్ధత నెలకొంది. ఈ విషయమై కాంగ్రెస్ వర్గాల నుంచి గానీ, దివ్య స్పందన నుంచి గానీ ఎలాంటి ప్రకటనా విడుదల కాలేదు.

పోస్టులు తొలగించిన అనంతరం దివ్య ట్విట్టర్ ఖాతా...

కొద్ది రోజులుగా కాంగ్రెస్​ సామాజిక మాధ్యమ బృందం నుంచి దివ్య దూరంగా ఉంటున్నారని సమాచారం. ఈ విషయమై ఆమె వద్ద ప్రస్తావన తీసుకురాగా మీకు వచ్చిన సమాచారం సరికాదని సమాధానాన్ని దాటవేస్తున్నారు దివ్య. ఈ ప్రశ్నలకు కాంగ్రెస్ వర్గీయులూ సమాధానాలు దాటవేస్తున్నారు.

పోస్టులు తొలగించకముందు

లోక్​సభ ఎన్నికల్లో ఓటమి నేపథ్యంలో నెలరోజులపాటు ఎలాంటి చర్చలు, టెలివిజన్ కార్యక్రమాల్లో కాంగ్రెస్ నేతలు పాల్గొనరని అధికారికంగా ప్రకటించింది కాంగ్రెస్. పార్టీ నిర్ణయానికనుగుణంగా తన ట్విట్టర్​ ఖాతాలో పోస్ట్​లను దివ్య తొలగించారా అనేది తెలియాల్సి ఉంది.

ఇదీ చూడండి: ప్రతిభా పాటిల్​కు మెక్సికో అత్యున్నత పురస్కారం

Last Updated : Jun 2, 2019, 12:34 PM IST

ABOUT THE AUTHOR

...view details