ETV Bharat Telangana

తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'మోదీ'లకు ఏదైనా సాధ్యమే: కాంగ్రెస్ - కాంగ్రెస్

పరారీలో ఉన్న వజ్రాల వ్యాపారి నీరవ్​ మోదీ లండన్​లో ఉన్నారన్న వార్తలపై భారత్​లో రాజకీయ వేడి రాజుకుంది. మోదీ ప్రభుత్వం పనితీరుపై కాంగ్రెస్​ విమర్శలు కురిపిస్తోంది.

రణ్​దీప్ సుర్జేవాలా
author img

By

Published : Mar 9, 2019, 1:19 PM IST

ఐదేళ్లయినా పరారీలో ఉన్నవారిని పట్టుకోవటంలో మోదీ ప్రభుత్వం విఫలమైందని కాంగ్రెస్​ పార్టీ విమర్శించింది. పంజాబ్​ నేషనల్​ బ్యాంక్​ కేసు నిందితుడు నీరవ్​ మోదీ పశ్చిమ లండన్​లో విలాసవంతమైన జీవితం గడుపుతున్నారన్న ఓ పత్రిక కథనంపై ఇలా స్పందించింది విపక్షం.

ప్రధానమంత్రి నరేంద్రమోదీ బ్యాంకు మోసగాళ్ల కోసం కంపెనీ నడుపుతున్నారని కాంగ్రెస్​ అధికార ప్రతినిధి రణ్​దీప్​ సుర్జేవాలా ఎద్దేవా చేశారు. భారత బ్యాంకుల నుంచి సుమారు రూ. లక్షకోట్లు లూటీ చేసిన వారిని ఐదేళ్లలో పట్టుకోలేకపోయారని ధ్వజమెత్తారు.

"పరారీలో ఉన్న నీరవ్​ మోదీ లండన్​లో విలాస జీవనం గడుపుతున్నారు. సుమారు రూ.75కోట్లు విలువచేసే భవంతిలో నివాసముంటున్నారు. మొదట రూ.23,000 కోట్లు బ్యాంకుల నుంచి లూటీ చేసి పారిపోయారు. సీబీఐ, ఈడీని మోసం చేశారు. మోదీ ఉన్నారు కాబట్టే ఇది సాధ్యమైంది."
-రణ్​దీప్​ సుర్జేవాలా, కాంగ్రెస్ అధికార ప్రతినిధి

మరిన్ని వివరాలకు:ఇక్కడ మోసాలు... అక్కడ విలాసాలు

ABOUT THE AUTHOR

...view details