ఇది వాలంటైన్స్ వీక్.. ఈ నెల 7న ప్రారంభమైన ఈ వీక్‌లో భాగంగా నిన్న బుధవారం ప్రేమ పక్షులన్నీ కౌగిలింతల డేగా జరుపుకొన్నాయి. ఈ నేపథ్యంలో దిల్లీ ఎన్నికల ఫలితాల మరుసటి రోజే భాజపాకు కౌంటర్ ఇస్తూ.. కాంగ్రెస్ ఓ సెటైరికల్ ట్వీట్ చేసింది. కౌగిలించుకోండి.. ద్వేషించొద్దు అని పేర్కొంటూ 'హగ్ డే' హ్యాష్‌ట్యాగ్‌తో ఓ వీడియోను ట్విట్టర్ హ్యాండిల్‌లో పోస్ట్ చేసింది.
హగ్ డే: భాజపాపై కాంగ్రెస్ ఆసక్తికర ట్వీట్ - వాలంటెన్స్ వీక్
వాలంటైన్స్ వీక్‌లో భాగంగా నిన్న కౌగిలింతల రోజున భాజపాపై ట్విట్టర్ వేదికగా వ్యంగ్యాస్త్రాలు సంధించింది కాంగ్రెస్. 'కౌగిలించుకోండి.. ద్వేషించొద్దు' అని పేర్కొంటూ.. హగ్ డే హ్యాష్‌ట్యాగ్‌తో ఓ వీడియోను పోస్ట్ చేసింది.
'పాపాన్ని ద్వేషించండి.. పాపిని ప్రేమించండి' అంటూ మహాత్ముడు ఇచ్చిన సందేశంతో మొదలైన రాహుల్ గాంధీ ప్రసంగంతో పాటు ప్రధాని మోదీని కౌగిలించుకొనే దృశ్యం ఉంది. 2018 జులైలో ఎన్డీయే ప్రభుత్వం అవిశ్వాస తీర్మానంపై ప్రసంగించిన వెంటనే కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అనూహ్యంగా ప్రధాని మోదీ వద్దకు వెళ్లి ఆయన్ను కౌగిలించుకోవడం అప్పట్లో చర్చనీయాంశమైంది. ఆ తర్వాత పలు సందర్భాల్లో రాహుల్ ఆ హగ్‌కు వివరణ ఇచ్చారు కూడా. వీటితో పాటు ఈ వీడియో చివర్లో కాంగ్రెస్ ప్రేమనే విశ్వసిస్తుందని, ద్వేషాన్ని కాదనే సందేశాన్ని పేర్కొంది. ప్రస్తుతం ఈ ట్వీట్ సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.
ఇదీ చూడండి:కర్ణాటకలో బంద్.. ఆంధ్రప్రదేశ్ బస్సుపై రాళ్ల దాడి