దేశంలో సమాచార విప్లవానికి ఆద్యులు మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ అని ఉద్ఘాటించారు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ. నేడు రాజీవ్ గాంధీ 75వ జయంతి సందర్భంగా దేశవ్యాప్తంగా పలు కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది కాంగ్రెస్. రాజీవ్ గాంధీ సమాధి వీర్ భూమి వద్ద కాంగ్రెస్ నేతలు నివాళులు అర్పించనున్నారు. ఇందిరా గాంధీ స్టేడియంలో నిర్వహించనున్న స్మారక సమావేశంలో సోనియాగాంధీ ప్రసంగించనున్నారు. ఇదే వేదికపై పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారు.
యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా రక్తదాన శిబిరాలు నిర్వహించనున్నారు. రైసినా రోడ్లో నిర్వహించే రక్తదాన కార్యక్రమానికి కాంగ్రెస్ సీనియర్ నేతలు హాజరు కానున్నారని సమాచారం.
'సాంకేతిక సారథి రాజీవ్'
దేశంలో సమాచార, సాంకేతిక విప్లవానికి రాజీవ్‌గాంధీ తీసుకున్న నిర్ణయాలే కారణమన్నారు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ.