తెలంగాణ

telangana

ETV Bharat / bharat

రాజీనామాపై పట్టువీడని రాహుల్.. శ్రేణుల ఆందోళన

కాంగ్రెస్​ పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా నిర్ణయంపై రాహుల్ గాంధీ వెనక్కి తగ్గడం లేదు. తాను పదవి నుంచి వైదొలుగుతానని సోనియా గాంధీ నేతృత్వంలో నేడు జరిగిన కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ భేటీలో మరోసారి చెప్పినట్టు సమాచారం. మరోవైపు.. అధ్యక్షుడిగా కొనసాగాలంటూ యూత్​ కాంగ్రెస్ శ్రేణులు రాహుల్​ గాంధీ నివాసం ఎదుట ఆందోళన నిర్వహించాయి.

By

Published : Jun 26, 2019, 1:32 PM IST

రాహుల్​ గాంధీ

కాంగ్రెస్​ పార్టీ జాతీయాధ్యక్ష పదవికి రాజీనామా చేస్తూ తీసుకున్న నిర్ణయంపై వెనక్కి తగ్గడం లేదు రాహుల్​ గాంధీ. సోనియా గాంధీ నేతృత్వంలో నేడు కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ భేటీలో జరిగింది. ఈ సందర్భంగా రాజీనామాను వెనక్కి తీసుకోవాలని ఎంపీలు రాహుల్​ను కోరగా, తాను పదవి నుంచి వైదొలిగేందుకే నిర్ణయించుకున్నానని రాహుల్​ మరోసారి తేల్చి చెప్పినట్టు సమాచారం.

పార్టీ వైఫల్యానికి అందరం కలిసి బాధ్యత తీసుకుందామని ఎంపీలు శశిథరూర్​, మనోజ్​ తివారీ చెప్పినా రాహుల్​ వినలేదని తెలిసింది.

సార్వత్రిక ఎన్నికల్లో హస్తం పార్టీ కేవలం 52లోక్​సభ స్థానాలను సాధించి.. ఘోర వైఫల్యం చెందింది. మనస్థాపం చెందిన రాహుల్​ గాంధీ.. అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. మరొకరిని పదవికి ఎంపిక చేయాలని పార్టీకి సూచించారు. రాజీనామాను తిరస్కరించి... అధ్యక్షుడిగా మీరే ఉండాలని సీడబ్ల్యూసీ సూచించినా ఆయన మనసు మార్చుకోలేదు​. ఈ నేపథ్యంలో అశోక్ గహ్లోత్​ పార్టీ అధ్యక్షుడిగా నియమితులవుతారన్న వాదనలు బలంగా వినిపిస్తున్నాయి.

పోరాడండి.. మీ వెంటే ఉంటాం

పార్టీ అధ్యక్ష పదవికి చేసిన రాజీనామాను వెనక్కి తీసుకోవాలని విన్నవిస్తూ రాహుల్​ గాంధీ నివాసం ఎదుట యూత్​ కాంగ్రెస్​ నేతలు, కార్యకర్తలు నేడు ఆందోళన చేపట్టారు. 'పోరాడండి.. మేం మీ వెంటే ఉంటాం' అని నినాదాలు చేశారు. దేశానికి రాహుల్​ గాంధీ అవసరముందుంటూ ప్లకార్డులు ప్రదర్శించారు.

ఇదీ చూడండి : జై శంకర్​, అజిత్​ డోభాల్​తో పాంపియో చర్చలు

ABOUT THE AUTHOR

...view details