తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'ఎన్నికల' మ్యాచ్​: సిద్ధూ X సింధియా - కాంగ్రెస్

మధ్యప్రదేశ్​లోని శివపురి మైదానంలో కాంగ్రెస్​ ఎన్నికల మ్యాచ్​ నిర్వహించింది. కాంగ్రెస్ ప్రముఖ నేతలు జ్యోతిరాదిత్య సింధియా, నవజ్యోత్​ సింగ్ సిద్ధూ ప్రత్యర్థులుగా తలపడ్డారు. ఆటను చూసేందుకు వేల సంఖ్యలో స్థానికులు హాజరయ్యారు.

క్రికెట్​ మైదానంలో కాంగ్రెస్​ 'ఎన్నికల' మ్యాచ్​

By

Published : May 10, 2019, 1:52 PM IST

ఎన్నికల ప్రచారంలో ఒక్కొక్కరిది ఒక్కో శైలి. ప్రజలకు తొందరగా చేరువయ్యే అంశాలను ప్రచారాస్త్రాలుగా మలుచుకుంటున్నారు. మధ్యప్రదేశ్​లో కాంగ్రెస్​ నేతలు ఇదే సూత్రాన్ని అనుసరించారు. ప్రచారంలో భాగంగా శివపురి పట్టణంలో క్రికెట్​ మ్యాచ్​ నిర్వహించారు. ఇందులో ప్రముఖ క్రికెటర్​, కాంగ్రెస్ నేత నవజోత్​ సింగ్ సిద్ధూ, ఎంపీ జ్యోతిరాదిత్య సింధియా ప్రత్యర్థులుగా తలపడ్డారు.

సిద్ధూ ఆధ్వర్యంలోని పంజాబ్​ ఎలెవన్​, సింధియా నేతృత్వంలోని ఎంపీ ఎలెవన్​ పోటీ పడ్డాయి. ప్రసంగాలతో హోరెత్తించే నేతలు... మైదానంలో పరుగులు పెట్టడాన్ని తిలకించేందుకు స్థానికులు భారీ సంఖ్యలో వచ్చారు.

సింధియా బ్యాటింగ్​ చేసి ఆకట్టుకున్నారు. సిద్ధు స్వతహాగా క్రికెటర్​ కావడం వల్ల తనదైన శైలిలో ఆడారు.

క్రికెట్​ మైదానంలో కాంగ్రెస్​ 'ఎన్నికల' మ్యాచ్​

అటు మ్యాచ్... ఇటు నిరసన

కాలుష్యపూరితమైన జాదవ్​ సాగర్​ సరస్సును శుద్ధి చేయాలని కొంతమంది యువకులు మైదానం బయట నిరసన చేపట్టారు. ఈ ప్రదర్శన సరస్సు పరిస్థితిని సింధియా దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నమేనని, ఆందోళన కాదని స్పష్టం చేశారు యువకులు.

"జాదవ్​ సాగర్​ చాలా కలుషితమైంది. ఇది సింధియా-ఛత్రి ట్రస్ట్​ పరిధిలోకే వస్తుంది. రోజురోజుకు సరస్సులో కాలుష్యం మరింత పెరుగుతోంది. వారొక్కరినే ఈ పని చేయమనట్లేదు. వారితో మేమూ ఉంటాం. కలిసి పని చేద్దాం."

-స్థానిక యువకుడు

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details