దేశవ్యాప్త లాక్డౌన్ నేపథ్యంలో వలస కూలీలు 100 కిలోమీటర్లకుపైగా కాలినడకన సొంత ఊళ్లకు వెళ్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ. దేశంలోని పలు రాష్ట్రాల్లో చిక్కుకుని స్వగ్రామానికి వెళ్లలేక ఇబ్బందులు పడుతున్న వారికి రవాణా సౌకర్యాలు కల్పించాలని ప్రధాని మోదీకి లేఖ రాశారు సోనియా.
" ఇతర ప్రాంతాల్లో చిక్కుకుపోయిన వారికి సాయం అందించే ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నా. నా తరఫున రెండు సూచనలు చేస్తున్నా. కాలినడకన వెళ్లే వారు తమ గ్రామాలను చేరుకునేందుకు రాష్ట్ర రవాణా సౌకర్యాన్ని ఒక్కరోజు కల్పించండి. లాడ్జీలలో, అతిథి గృహాల్లో గడిపే స్తోమత లేని వారికి ఆశ్రయం కల్పించేలా జిల్లా కలెక్టర్లు చర్యలు తీసుకోవాలి. "
-లేఖలో సోనియా గాంధీ.
ప్రియాంక వీడియో