తెలంగాణ

telangana

ETV Bharat / bharat

కర్ణాటక కాంగ్రెస్​ నేత డీకే శివకుమార్​ అరెస్ట్ - శివకుమార్

కర్ణాటక కాంగ్రెస్​ నేత డీకే శివకుమార్​ అరెస్ట్

By

Published : Sep 3, 2019, 9:04 PM IST

Updated : Sep 29, 2019, 8:22 AM IST

22:45 September 03

అరెస్టుకు నిరసనగా రేపు కర్ణాటక వ్యాప్తంగా నిరసనలు

తమ  పార్లీ నేత శివకుమార్​ అరెస్టుకు నిరసనగా రేపు కర్ణాటక వ్యాప్తంగా నిరసనలు చేపట్టనున్నట్టు కాంగ్రెస్ ప్రకటించింది.

21:32 September 03

ఎట్టకేలకు సాధించారు: డీకే

తన అరెస్ట్​పై డీకే శివకుమార్​ ట్విట్టర్​లో కీలక వ్యాఖ్యలు చేశారు. 

నా భాజపా మిత్రులకు శుభాకాంక్షలు. ఎట్టకేలకు నన్ను అరెస్ట్​ చేయించడంలో సఫలమయ్యారు. నా మీద ఉన్న ఐటీ, ఈడీ కేసులు రాజకీయ కక్ష సాధింపు కోసం ప్రేరేపించి పెట్టినవి. భాజపా రాజకీయాలకు నేను బాధితుడినయ్యా.  - ట్విట్టర్​లో డీకే శివకుమార్

21:29 September 03

రేపు కోర్టు ముందుకు...

కర్ణాటక కాంగ్రెస్‌ నాయకుడు, మాజీ మంత్రి డీకే శివకుమార్‌ను ఈడీ అరెస్ట్ చేసింది. మనీలాండరింగ్ ఆరోపణలపై... నాలుగోసారి దిల్లీలోని ఈడీ అధికారుల ముందు హాజరైన

శివకుమార్‌ను అదుపులోకి తీసుకున్నారు.  మనీలాండరింగ్ నిరోధక చట్టం కింద అరెస్ట్ చేస్తున్నట్లు ప్రకటించారు. కస్టోడియల్ విచారణ అవసరం కాబట్టే అరెస్ట్ చేసినట్లు ఈడీ తెలిపింది.

శివకుమార్‌ను రేపు కోర్టులో హాజరుపరిచి.. ఈడీ అధికారులు కస్టడీ కోరనున్నారు. గతేడాది సెప్టెంబరులో శివకుమార్ సహా దిల్లీలోని కర్ణాటక భవన్​ అధికారి హనుమంతప్పపై... ఈడీ మనీలాండరింగ్ కేసు నమోదు చేసింది.

20:51 September 03

కర్ణాటక కాంగ్రెస్​ నేత డీకే శివకుమార్​ అరెస్ట్

  • కర్ణాటక కాంగ్రెస్ నేత డీకే శివకుమార్‌ను అరెస్టు చేసిన ఈడీ
  • మనీలాండరింగ్ కేసులో అదుపులోకి తీసుకున్న ఈడీ
  • గత కొన్నిరోజులుగా దిల్లీలో శివకుమార్‌ను ప్రశ్నిస్తున్న ఈడీ అధికారులు
  • ఆర్థిక నేరాల కేసులో శివకుమార్‌ను అరెస్టు చేసిన ఈడీ 
     
Last Updated : Sep 29, 2019, 8:22 AM IST

ABOUT THE AUTHOR

...view details