తెలంగాణ

telangana

ETV Bharat / bharat

సోనియా, ప్రియాంక ఫొటోలున్న చీరలతో ప్రచారం

గుజరాత్​ స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. అభ్యర్థులు తమ ప్రచారాన్ని ముమ్మరం చేశారు. కొందరు వినూత్న ప్రచారం నిర్వహిస్తూ ఓట్లు రాబట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. సూరత్​లోని ఒకటో వార్డు కాంగ్రెస్​ అభ్యర్థి.. కాంగ్రెస్​ అధ్యక్షురాలు సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ ఫొటోలున్న చీరను ధరించి ప్రచారం నిర్వహిస్తున్నారు.

By

Published : Feb 6, 2021, 10:45 AM IST

congress candidate from surat wears a printed sari with photos of Sonia Gandhi, Priyanka Gandhi and Rahul Gandhi.
గుజరాత్​ ఎన్నికల చిత్రాలు.. చీరలపై సోనియా ఫొటోలు

త్వరలో జరగనున్న గుజరాత్​ స్థానిక సంస్థల పోరు కోసం అభ్యర్థులు ప్రచార వ్యూహాలకు పదును పెంచారు. ఓటర్లను ఆకర్షించేందుకు సూరత్​​ ఒకటో వార్డు కాంగ్రెస్​ అభ్యర్థి పరూల్ విభిన్న ఆలోచన చేశారు. పార్టీ​ అధ్యక్షురాలు సోనియా గాంధీ సహా.. జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ, రాహుల్​ గాంధీల ఫొటోలున్న చీరలను ధరించి ప్రచారం నిర్వహిస్తున్నారు. అంతేగాక కార్యకర్తల కోసం సుమారు 1000 చీరలను సిద్ధం చేయిస్తున్నారు.

గుజరాత్​ స్థానిక ఎన్నికల్లో సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ ఫొటోలున్న చీరను ప్రదర్శిస్తున్న అభ్యర్థి 'పరూల్​'

26 ఏళ్లుగా కాంగ్రెస్​లోనే..

26 ఏళ్లుగా పార్టీకి సేవ చేస్తున్న తమకు ఈ ఎన్నికల్లో రెండు టికెట్లు దక్కుతాయని పరూల్​ దంపతులు ఆశించారు. ఓబీసీ కోటాలో ఆమె పోటీ చేస్తుండగా.. ఆమె భర్తకు టికెట్​ దక్కలేదు. కాంగ్రెస్​ నాయకుల ఫొటోలను ప్రింట్ చేయించిన​ చీరలతో ఓటర్ల దృష్టిని ఆకర్షించి.. ఎన్నికల్లో గెలవాలని భావిస్తున్నారు.

రాహుల్​ గాంధీ టీ-షర్టులతో పాటు.. కాంగ్రెస్​ గుర్తుతో ఉన్న మాస్కులను తమ కార్యకర్తలకు పంచనున్నట్టు ఆమె తెలిపారు.

ఇదీ చదవండి:ఎన్నికల వేళ తమిళనాడు సర్కార్​ వరాల జల్లు

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details