ఝార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో విజయం దిశగా కాంగ్రెస్-జేఎంఎం కూటమి దూసుకుపోతోంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ కార్యకర్తలు సంబరాలు చేసుకుంటున్నారు. దిల్లీలోని పార్టీ ప్రధాన కార్యాలయం ఎదుట కార్యకర్తలు పటాసులు పేల్చి మిఠాయిలు పంచుకున్నారు.
ఎన్నికల సంఘం విడుదల చేసిన సమాచారం ప్రకారం.. మధ్యాహ్నం 12 గంటలకు కాంగ్రెస్ 12, జేఎంఎం 25, భాజపా 29 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నాయి.