కేంద్ర ప్రభుత్వం కీలక అజెండాగా తీసుకున్న 5 అంశాలపై చర్చించేందుకు దిల్లీలో అఖిలపక్షం సమావేశమైంది. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షత వహించారు. పలు పార్టీల అధినేతలు, ప్రతినిధులు హాజరయ్యారు.
జమిలి ఎన్నికలు, దేశ 75వ స్వాత్రంత్య వేడుకలు సహా పలు అంశాలపై సమాలోచనలు జరుపుతున్నారు. 'ఒకే దేశం-ఒకే ఎన్నిక'పై ప్రధానంగా చర్చ సాగనుంది. లోక్సభ సహా అన్ని రాష్ట్రాల శాసనసభలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించే అంశంపై అన్ని పార్టీల అభిప్రాయాలను కోరనుంది కేంద్రం.
చర్చకు నిర్దేశించుకున్న అంశాలివే...
- పార్లమెంటు ఔన్నత్యాన్ని పెంపొందించడం.
- ఒకే దేశం- ఒకే ఎన్నిక
- 75 ఏళ్ల స్వాతంత్ర్యం సందర్భంగా నవభారత నిర్మాణం
- మహాత్మాగాంధీ 150వ జయంతి వేడుకల నిర్వహణ.
- వెనుకబడిన జిల్లాల అభివృద్ధి.