తెలంగాణ

telangana

ETV Bharat / bharat

కాంగ్రెస్​ శ్రేణుల 'బిర్యానీ ఫైట్​'- 9 మంది అరెస్ట్​

ఉత్తర్​ప్రదేశ్​లోని ముజఫర్​నగర్​ జిల్లాలో ఎన్నికల సమావేశం అనంతరం కాంగ్రెస్​ కార్యకర్తలు బిర్యానీ కోసం ఘర్షణ పడ్డారు. ఈ ఘటనలో పలువురికి తీవ్రగాయాలయ్యాయి. మాజీ ఎమ్మెల్యే నసీముద్దీన్​ సిద్దికీ సహా 34 మందిపై కేసు నమోదు చేశారు పోలీసులు. 9 మందిని అదుపులోకి తీసుకున్నారు.

యూపీ కాంగ్రెస్ కార్యకర్తల 'బిర్యానీ ఫైట్'!

By

Published : Apr 7, 2019, 1:22 PM IST

Updated : Apr 7, 2019, 3:02 PM IST

కాంగ్రెస్​ శ్రేణుల 'బిర్యానీ ఫైట్​'- 9 మంది అరెస్ట్​

ఉత్తర ప్రదేశ్​లో కాంగ్రెస్ కార్యకర్తల బిర్యానీ ఫైట్ విడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఎన్నికల ప్రచారంలో భాగంగా నిర్వహించిన ఓ సమావేశం అనంతరం బిర్యానీ విందు ఏర్పాటు చేశారు. ఈ బిర్యానీ కార్యకర్తల మధ్య ఘర్షణకు కారణమైంది. కర్రలతో దాడి చేసుకునే వరకు వెళ్లింది.

బిజ్నోర్​ లోక్​సభ నియోజకవర్గ కాంగ్రెస్​ అభ్యర్థి నసిముద్దీన్​ సిద్దిఖీ ఉత్తర్​ప్రదేశ్​ ముజఫర్​నగర్​ జిల్లా తధేడా గ్రామంలో మాజీ ఎమ్మెల్యే మౌలానా జమీల్​ ఇంటి వద్ద ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సమావేశం అనంతరం మధ్యాహ్నం బిర్యానీ విందు ఏర్పాటు చేశారు. బంతిలో ముందుండాలని కార్యకర్తలు ఒక్కసారిగా ఎగబడ్డారు. దీంతో కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది.

ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు అల్లరి మూకలను చెదరగొట్టారు. మాజీ ఎమ్మెల్యే జమీల్​, ఆయన కొడుకు నయీమ్​ అహ్మద్​ సహా 34 మందిపై ఎన్నికల నియమావళి ఉల్లంఘన కింద కేసు నమోదు చేసినట్లు సీఐ రామ్​ మోహన్​ శర్మ తెలిపారు. ఇప్పటి వరకు ఈ కేసులో 9మందిని అరెస్ట్​ చేశామన్నారు. గ్రామంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా అదనపు బలగాలను మోహరించారు.

వారం క్రితమే బీఎస్పీ నుంచి కాంగ్రెస్​లో చేరారు జమీల్​. 2012 అసెంబ్లీ ఎన్నికల్లో మీరాపుర్​ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.

బిజ్నోర్​లో తొలిదశలో ఏప్రిల్​ 11న ఎన్నికలు జరగనున్నాయి.

ఇదీ చూడండీ: 'స.హ చట్టం పరిధిలోకి రాజకీయ పార్టీలు!'

Last Updated : Apr 7, 2019, 3:02 PM IST

ABOUT THE AUTHOR

...view details