మహారాష్ట్ర శాసనసభ ఎన్నికల కోసం కాంగ్రెస్- ఎన్సీపీ సీట్ల పంపకంపై ఎట్టకేలకు స్పష్టత వచ్చింది. రెండు పార్టీలు చెరో 125 సీట్లలో పోటీ చేస్తాయని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శరద్ పవార్ ప్రకటించారు. ఇతర మిత్రపక్షాలకు 38 సీట్లు కేటాయించినట్టు పవార్ ట్వీట్ చేశారు.
2014లో కాంగ్రెస్-ఎన్సీపీ కలిసి పోటీ చేయలేదు. సీట్లు సర్దుబాటు కాకపోవడం వల్ల హస్తం పార్టీతో ఉన్న 15ఏళ్ల పొత్తును తెంచుకుంది ఎన్సీపీ. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ 42, ఎన్సీపీ 41 స్థానాల్లో గెలుపొందాయి. 122 సీట్లతో భాజపా అతి పెద్ద పార్టీగా అవతరించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.