తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'అల్లర్లతో భరతమాతకు ఎలాంటి ప్రయోజనం లేదు' - అల్లర్లు, ఘర్షణలతో దేశాని ఎలాంటి ప్రయోజనం లేదు: రాహుల్​

అల్లర్లతో అట్టుడికిన ఈశాన్య దిల్లీలో రాహుల్​ గాంధీ నేతృత్వంలోని కాంగ్రెస్​ నేతల బృందం పర్యటించింది. దెబ్బతిన్న ఇళ్లు, పాఠశాలలను సందర్శించారు నేతలు. ఈ సందర్భంగా అల్లర్ల వల్ల దేశానికి, భరతమాతకు ఎలాంటి ప్రయోజనం ఉండదన్నారు రాహుల్​. కలిసికట్టుగా దేశాన్ని ముందుకు నడిపించాలని పిలుపునిచ్చారు.

Cong leaders led by Rahul to visit riot-affected areas in Delhi
రాహుల్‌ గాంధీ, కాంగ్రెస్‌ అగ్ర నేత

By

Published : Mar 4, 2020, 7:41 PM IST

Updated : Mar 4, 2020, 11:09 PM IST

'అల్లర్లతో భరతమాతకు ఎలాంటి ప్రయోజనం లేదు'

అల్లర్లు, ఘర్షణల వల్ల భారత్‌కు ఎలాంటి ప్రయోజనం ఉండదని కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ అన్నారు. ఇటీవలే అల్లర్లతో అట్టుడికిన ఈశాన్య దిల్లీలో రాహుల్‌ గాంధీ నేతృత్వంలోని కాంగ్రెస్‌ నేతల బృందం పర్యటించింది. అల్లర్లలో దెబ్బతిన్న ఇళ్లు, పాఠశాలలు, వ్యాపార సముదాయాలను పరిశీలించింది.

బాధితులతో మాట్లాడిన రాహుల్‌ అక్కడి పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. అల్లర్ల వల్ల ప్రపంచంలో భారత్‌ ప్రతిష్ట దెబ్బతింటుందని పేర్కొన్నారు.

"దేశాన్ని విభజించడం వల్ల, కాల్చడం వల్ల భారత్‌కు, భరతమాతకు ఎలాంటి ప్రయోజం కల్గదు. అంతా కలిసి ప్రేమతో బతికేందుకు, భారత్‌ను కలుపుకొని ముందుకు తీసుకువెళ్లేందుకు నేను ఇక్కడికి వచ్చాను. భారత్‌లో, దేశ రాజధానిలో హింస జరిగితే విదేశాల్లో భారత ప్రతిష్ట దెబ్బతింటుంది. సోదరభావం, ఐక్యత, ప్రేమ అనే భారతదేశ బలాలను ఇక్కడ కాల్చివేశారు. ఇలాంటి రాజకీయాల వల్ల కేవలం కాలిపోయిన ఇక్కడి పాఠశాలకు మాత్రమే కాదు భారతదేశానికి, భరతమాతకు నష్టం జరుగుతుంది. "

- రాహుల్‌ గాంధీ, కాంగ్రెస్‌ అగ్ర నేత

రెండు బృందాలుగా..

ఈశాన్య దిల్లీలో రెండు బృందాలుగా కాంగ్రెస్​ నేతలు పర్యటించారు. మొదటి బృందంలో హిబి ఎడిన్​, గుర్జీత్​ సింగ్​ ఔజ్లా, అబ్దుల్​ కలేఖ్​ సహా పలువురు ఎంపీలు ఉన్నారు. కేరళ భవనం నుంచి బస్సులో సందర్శనకు వెళ్లారు. రెండో బృందంలో రాహుల్​ గాంధీ, కేసీ వేణుగోపాల్​, అధిర్​ రంజన్​ చౌదరి, కె.సురేష్​, ముకుల్​ వాస్నిక్​, కుమారి సెల్జా, గౌరవ్​ గొగొయి, రణ్​దీప్​ సింగ్​ సుర్జేవాలా ఉన్నారు. మొదటి బృందం కూడా స్థానిక ప్రజలతో మాట్లాడి పరిస్థితులను అడిగి తెలుసుకుంది.

ఇదీ చూడండి: లైవ్​: దిల్లీ అల్లర్ల ప్రభావిత ప్రాంతాలకు కాంగ్రెస్​ నేతలు

Last Updated : Mar 4, 2020, 11:09 PM IST

ABOUT THE AUTHOR

...view details