తెలంగాణ

telangana

ETV Bharat / bharat

''కాంగ్రెస్సే పొత్తుకు నిరాకరించింది'' - అరవింద్​ కేజ్రీవాల్​

దిల్లీలో ఆమ్​ ఆద్మీ పార్టీతో పొత్తు పెట్టుకోవడానికి కాంగ్రెస్​ నిరాకరించిందని ముఖ్యమంత్రి కేజ్రీవాల్​ తెలిపారు. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో భాజపాను ఓడించాలనే లక్ష్యంతో ముందుకెళ్తున్నా, పొత్తు విషయంలో రెండు పార్టీలు ఓ కొలిక్కిరాలేకపోతున్నాయి.

పొత్తుకు కాంగ్రెస్ నిరాకరించింది: కేజ్రీవాల్​

By

Published : Mar 20, 2019, 6:37 AM IST

పొత్తుకు కాంగ్రెస్ నిరాకరించింది: కేజ్రీవాల్​
దిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్​)తో పొత్తు పెట్టుకోవడానికి కాంగ్రెస్​ నిరాకరించిందని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అరవింద్​ కేజ్రీవాల్​ తెలిపారు. ప్రస్తుతం పొత్తులపై కాంగ్రెస్​- ఆప్ పార్టీల మధ్య​ ఎలాంటి చర్చలు కొనసాగడంలేదని ఆయన స్పష్టం చేశారు.

పంజాబ్​, హరియాణా, దిల్లీల్లో కాంగ్రెస్​ పార్టీతో పొత్తు పెట్టుకునేందుకు ఆప్​ సుముఖత వ్యక్తం చేసిన కొన్ని గంటల్లోనే కేజ్రీవాల్​ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. మరోవైపు ఆప్ నేత సంజయ్​ సింగ్​, ఎన్సీపీ అధినేత శరద్​పవార్​తో పొత్తుల విషయమై భేటీ అయ్యారు.

సీట్ల బేరం

దిల్లీలో ఆప్​-కాంగ్రెస్​ మధ్య సీట్ల పంపకంపై కేజ్రీవాల్​ పార్టీ ఓ ప్రతిపాదన చేసింది. దిల్లీలో ఆప్​ 5 స్థానాల్లో పోటీ చేస్తుందని, కాంగ్రెస్​కు 2 సీట్లు ఇస్తామని ప్రతిపాదించింది. అలాగే పంజాబ్​లో -3, హరియాణాలో -2 స్థానాల్లో పోటీ చేయాలని ఆప్​ భావిస్తోంది. అయితే ఆప్​ ప్రతిపాదనలను కాంగ్రెస్​ తిరస్కరించింది. ముఖ్యంగా మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్​ ఆప్​తో పొత్తును తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఆప్​తో పొత్తు దీర్ఘకాలంలో కాంగ్రెస్​కు చేటు తెస్తుందని ఆమె భావిస్తున్నారు.

పొత్తు కుదరడం లేదు..

సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో భాజపాను ఓడించాలనే లక్ష్యంతో ముందుకెళ్తున్నా, పొత్తు విషయంలో రెండు పార్టీలు ఓ కొలిక్కిరాలేకపోతున్నాయి. ముందుగా ఆప్​ తమది ఒంటరి పోరని ప్రకటించింది. ఇప్పుడు కాంగ్రెస్​, ఆప్​తో పొత్తుకు ససేమిరా అంటోంది.

ఆప్​ ప్రచారం షురూ...

ఆప్​ నేత గోపాల్ రాయ్​ ఆప్​ తన ఎన్నికల ప్రచారాన్ని రెండు విడతలుగా నిర్వహిస్తుందని తెలిపారు. మార్చి 23 నుంచి ఏప్రిల్​ 7 వరకు మొదటి దఫా, రెండో విడత ఏప్రిల్​ 8 నుంచి ఏప్రిల్​ 30 వరకు ఎన్నికల ప్రచారం చేస్తామని తెలిపారు. మొత్తంగా 208 జనసభలు నిర్వహించడానికి ప్రణాళిక వేసినట్లు ఆయన తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details