పౌరసత్వ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా నిరసన చేపట్టాలని కాంగ్రెస్ పిలుపునిచ్చింది. బుధవారం అన్ని రాష్ట్రాల్లో ఆందోళనలు చేపట్టాలని ఆయా రాష్ట్రాల కాంగ్రెస్ అధ్యక్షులకు ఆదేశాలు జారీ చేసింది.
ఈమేరకు అన్ని రాష్ట్రాల పీసీసీ అధ్యక్షులు, పార్టీ సభాపక్షనేతలకు ప్రత్యేకంగా లేఖలు రాశారు కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్. లోక్సభలో పాసైన బిల్లును రాజ్యసభలో బుధవారం ప్రవేశపెట్టనున్నందున.. నిరసనలు చేపట్టాలని ఆదేశించారు. బిల్లుపై ప్రజలకు విస్తృత అవగాహన కల్పించి.. పార్టీ నిర్ణయానికి మద్దతు కూడగట్టాలని వేణుగోపాల్ తెలిపారు.