తెలంగాణ

telangana

ETV Bharat / bharat

మోదీపై కంప్యూటర్​ బాబా నిప్పులు..!

కంప్యూటర్​ బాబాగా ప్రసిద్ధి చెందిన ప్రముఖ ఆధ్యాత్మిక గురువు నామ్‌దేవ్‌ దాస్‌ త్యాగి ప్రధాని నరేంద్ర మోదీపై మండిపడ్డారు. అయోధ్యలో రామ మందిరాన్ని నిర్మించకపోవడంపై తీవ్ర విమర్శలు చేశారు.

By

Published : May 7, 2019, 2:12 PM IST

Updated : May 7, 2019, 7:38 PM IST

మోదీపై కంప్యూటర్​ బాబా నిప్పులు..!

మోదీపై కంప్యూటర్​ బాబా ఆగ్రహం

కంప్యూటర్‌ బాబాగా ప్రసిద్ధి చెందిన ప్రముఖ ఆధ్యాత్మిక గురువు నామ్‌దేవ్‌దాస్‌ త్యాగి ప్రధాని నరేంద్ర మోదీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఐదేళ్లు గడిచినా భాజపా ప్రభుత్వం అయోధ్యలో రామమందిరాన్ని నిర్మించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అయోధ్యలో రామ మందిరం లేదు కాబట్టి మోదీ కూడా లేరంటూ తీవ్ర విమర్శలు చేశారు.

దిగ్విజయ్​ సింగ్​ పూజలు

భోపాల్​లో కాంగ్రెస్​ నేత దిగ్విజయ్ సింగ్​ ఎన్నికల సభా వేదిక వద్దే వందలాది మంది సాధువులు కంప్యూటర్​ బాబా 'హత​ యోగా' నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న దిగ్విజయ్​ నామ్​దేవ్​దాస్​తో కలిసి ప్రత్యేక పూజలు చేశారు.

గతంలో మంత్రి హోదా

మధ్యప్రదేశ్​లో భాజపా అధికారంలో ఉన్నప్పుడు నామ్​దేవ్​ దాస్​కు మంత్రి హోదా కల్పించింది శివరాజ్​ సింగ్​ ప్రభుత్వం. అయితే ఇటీవలే భాజపాపై యుద్ధం ప్రకటించారు కంప్యూటర్​ బాబా. గోసంరక్షణకు రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదని, ఆలయాలు, సాధువుల విషయంలోనూ తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరించిందని ఆరోపించారు.

ఎప్పుడూ వెంట ల్యాప్‌టాప్‌ తీసుకెళ్లే త్యాగి.. కంప్యూటర్‌ బాబాగా సుప్రసిద్ధులు.


సాధువులంతా ధర్మంగానే ఉంటారు. ధర్మాన్ని పాటించేవారే వ్యక్తిత్వం కలిగినవారు. వారితోనే సాధువులంతా ఉంటారు. అబద్ధాలు చెప్పి ప్రజల్ని మోసం చేస్తారు. సాధువుల్నీ మోసం చేస్తారు. భాజపా ప్రభుత్వం ఇప్పటివరకూ సాధువుల్ని మోసం చేస్తూ వచ్చింది. ఐదేళ్లు అధికారంలో ఉండి రామ మందిరాన్ని నిర్మించలేదు. మళ్లీ మందిర నిర్మాణం ప్రచారాస్త్రంగా ఎన్నికలకొచ్చారు. ఇప్పుడు ప్రజలు, సాధువులు మోసపోరు. మందిర నిర్మాణం జరగకుంటే మోదీ లేరు.
- కంప్యూటర్ బాబా, ఆధ్యాత్మిక గురువు

ఇదీ చూడండి : హెచ్​1బీ దరఖాస్తుల రుసుము పెంపు!

Last Updated : May 7, 2019, 7:38 PM IST

ABOUT THE AUTHOR

...view details