ఛత్తీస్‌గఢ్‌లో జవాన్లతో వెళ్తున్న బస్సు వరద ప్రవాహంలో కొట్టుకుపోయింది. మల్కన్‌గిరి సరిహద్దు ప్రాంతం- ఒడిశాలోని బీజాపూర్ రహదారిపై భారీగా వరదనీరు ప్రవహిస్తోంది. అదే మార్గం గుండా ఆర్మీ బస్సు వెళ్తుండగా ఈ ఘటన సంభవించింది. అయితే.. ప్రమాద సమయంలో 30 మంది జవాన్లు అందులో ఉండగా.. అందరూ సురక్షితంగా బయటపడ్డారు.
వరదలో కొట్టుకుపోయిన జవాన్ల బస్సు
ఛత్తీస్‌గఢ్‌లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా వరదలు పోటెత్తుతున్నాయి. పెద్దఎత్తున వరద నీరు ప్రవహిస్తుండటం వల్ల.. 30మంది జవాన్లతో కూడిన బస్సు ప్రవాహంలో కొట్టుకుపోయింది. అయితే అందులో ఉన్నవారంతా క్షేమంగా బయటపడ్డారు.
ఛత్తీస్‌గఢ్ వరదల్లో కొట్టుకుపోయిన జవాన్ల బస్సు
డిస్ట్రిక్ట్ రిజర్వ్డ్ గ్రూప్(డీఆర్జీ) జవాన్లు.. నక్సల్స్ ఆపరేషన్ నిర్వహించి తిరిగివస్తున్న సమయంలో ఈ ఘటన జరిగింది.
ఇదీ చదవండి:కొవిడ్ ఆస్పత్రిలో భారీ అగ్ని ప్రమాదం